calender_icon.png 26 January, 2026 | 6:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి, ఉత్పాదకతే లక్ష్యం!

25-01-2026 12:00:00 AM

నరేగా కంటే జీ రామ్ జీ ఉత్తమం

గత రెండు దశాబ్దాల్లో ఎంజీనరేగా (మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) ప్రపంచంలోనే అతిపెద్ద సంక్షేమ ఉపాధి కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ పథకం పేరుతో ఇప్పటివరకు పదిహేను కోట్లకు పైగా జాబ్ కా ర్డులు జారీ అయ్యాయి. ఏటా ఏడు నుంచి ఎనిమిది కోట్ల కుటుంబాలు ఉపాధిని పొందుతున్నాయి. పథకం మొత్తం వ్యయం రూ. 11.57 లక్షల కోట్లకు మించిపోయింది. ఇక వార్షిక కేటాయింపులు సాధారణంగా రూ 60 వేల కోట్ల నుంచి 90 వేల కోట్ల మధ్య ఉన్నాయి. అయితే ఒక్కో కుటుంబానికి లభించే సగటు ఉపాధి చట్టంలో హామీ ఇచ్చిన 100 రోజులతో పోలిస్తే 45 నుంచి 50 రోజులకు మాత్రమే పరిమితమవుతున్నాయి.

యూపీఏ సర్కార్ హయాంలో ఎంజీనరేగా పథకం వ్యయం రూ. 2.13 లక్షల కోట్లు ఉండగా.. అదే ఎన్డీయే పాలనా కాలంలో ఇది రూ. 8.53 లక్షల కోట్లుగా ఉంది. నరేగా పథకానికి ఇంత భారీ మొత్తం ఆర్థిక వ్యయం చేసినప్పటికీ గ్రామీణ ఉత్పాదకత సూచికలైన-- రైతుల ఆదాయం, వ్యవ సాయేతర ఉపాధి, గ్రామస్థాయి వ్యాపారాలు మాత్రం అందుకనుగుణంగా- పెరగ లేదు. పథకం కోసం పెడుతున్న ఖర్చు, వస్తున్న ఫలితాల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తున్నది.

నరేగాలో లోపాలు..

యూపీఏ హయాం నుంచి అమలవుతూ వచ్చిన నరేగా పథకంలో లోపాలు న్నాయి. చట్టపరంగా 100 రోజుల హామీ ఉన్నప్పటికీ సగటు పనిదినాలు 45- నుంచి -55 మధ్యే ఉన్నాయి. తెలంగాణలో ఇది 28 రోజులకు మించి ఉండడం లేదు. రూల్ ప్రకారం 15 రోజుల్లో చెల్లించాల్సిన వేతనాలు ఆలస్యం కావడం వల్ల కూలీలు అప్పు లపై ఆధారపడాల్సి వస్తుండడంతో పాల్గొనడం తగ్గుతున్నది.--2025 రాష్ట్రాల వారీగా రోజుకు రూ. 241 నుంచి 400 మధ్య ఉన్న వేతనాలతో కనీస అవసరాలు తీరడం లేదు. దీనికి తోడు అవినీతి, నిధుల లీకేజీలు,- నకిలీ జాబ్ కార్డులు, నిధుల దుర్వినియోగం, కాంట్రాక్టర్ జోక్యంతో పథకం నీరుగారిపోతున్నది.

గుజరాత్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో కోట్లకు పైగా నకిలీ జాబ్ కార్డులు నమోదయ్యాయి.- కేంద్రీకృత ఎంఐఎస్ వ్యవస్థలు, ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్ వంటి డిజిటల్ హాజరు యాప్‌లపై అధికంగా ఆధారపడటం వల్ల పంచాయతీ రాజ్ సంస్థల ప్రణాళికలు, ఫిర్యాదులు, పరిష్కార మార్గాల పాత్ర తగ్గిపోయింది.--సామాజిక వివక్ష కారణంగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.--సాగు కాలంలో కార్మికులు అందుబాటులో ఉండకపోవడం రైతులకు సమస్యగా మారిపో యింది. నరేగా పథకం తాత్కాలిక ఉపశమనమిస్తున్నా, నిర్మాణాత్మక పేదరికాన్ని తగ్గిం చలేకపోయింది. ‘ఉపాధి పథకాలు ఉత్పాకథ సామర్థ్యాన్ని సృష్టించకపోతే అవి ఖరీ దైన నిల్వ వ్యవస్థలుగా మారుతాయి’ అని నోబెల్ విజేత అభిజిత్ బెనర్జీ హెచ్చరికలు చేసిన విషయం గుర్తుకువస్తున్నది.

2025 లో ఉన్న ఇప్పటి భారత్ 2005 నాటిది ఎంతమాత్రం కాదు. దాదాపు అన్ని గ్రామాలకు విద్యుత్ చేరింది. పీఎంజీఎస్‌వై ద్వారా గ్రామీణ రహదారులు విస్తరించాయి. డిజిటల్ చెల్లింపులు, ఆధార్ ఆధారిత వ్యవస్థలు సర్వ సాధారణమయ్యాయి. అయితే నేడు నైపుణ్య కొరతే నిరుద్యోగం కంటే పెద్ద సమస్యగా చెప్పొచ్చు. వాతావరణ మార్పులు,  నీటి సంరక్షణ, నేల ఉత్పాదకత, సుస్థిర వ్యవసాయానికి కొత్త ప్రాధాన్యత తీసుకొచ్చాయి. 2005లో 28 శాతమున్న పేదరికం 2025 నాటికి సుమారు 5 శాతం వరకు తగ్గింది.

జీ రామ్ జీ ఉద్దేశం..

ఎంజీనరేగా స్థానంలో తీసుకొచ్చిన వీబీ జీ రామ్ జీ (వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్‌గార్ యోజన్ అజీవిక గ్రామీణ మిషన్) బిల్ ఒక సరళమైన సూత్రంపై ఆధారపడి ఉంది. అదేంటంటే వేతనాలు పనులు ఆస్తుల సృష్టి. ఇది సామాజిక న్యాయాన్ని తగ్గించదు,- ఆధునీకరిస్తుంది. ప్రభుత్వ బా ధ్యత శాశ్వత వేతన హామీ కాదు, ఉత్పాదక ఉపాధి హామీ అని చెప్పొచ్చు. ఉపాధి కొలి చే ఆర్థిక ఫలితాలకు అనుసంధానమవుతుం ది. పనులు గ్రామాభివృద్ధి ప్రణాళికల తో అనుసంధానమై ఉంటాయి. ఆస్తులు దీర్ఘకాల లాభాలను అందించాలి.వీబీ జీ రామ్ జీ అనేది  ఉపాధితో పాటు నైపుణ్యాలను అనుసంధానిస్తుంది.

కార్మికుల సామర్థ్యాల ఆధారంగా మ్యాపింగ్ చేసి మేస్త్రీ పనులు, ఎలక్ట్రికల్ పనులు, నీటి నిర్వహణ, సోలార్ నిర్వహణ, వ్యవసాయ లాజిస్టిక్స్ వంటి రం గాల్లో శిక్షణ, సర్టిఫికేషన్ అందిస్తుంది. ఈ పథకం  గ్రామాన్ని అభివృద్ధి ప్రణాళిక కేం ద్రంగా మారుస్తుంది. ప్రతి గ్రామం ఐదు సంవత్సరాల వృద్ధి ప్రణాళిక రూపొందిస్తుంది.  ముఖ్యంగా నీటి భద్రత, వ్యవసాయ ఉత్పాదకత, గ్రామ మౌలిక వసతుల ప్రణాళికలకు అనుగుణంగా ఉత్పాదక ఆస్తులకే నిధులు విడుదలవుతాయి. దేశంలోని ప్రతి గ్రామాలకు తమ అవసరాలు ఆయా గ్రామస్థులకే బాగా తెలుసు. అందుకే ప్రణాళిక, నిధుల వినియోగ అధికారాలను గ్రామసభలకు బదిలీ చేయడం జరుగుతుంది.

అవినీతికి చెక్..

భారతదేశంలో మొత్తం 2.60 లక్షల గ్రా మపంచాయతీలున్నాయి. దేశ వార్షిక బడ్జెట్ రూ. 1,51, 282 కోట్లు కాగా.. ఇందు లో ప్రభుత్వ వాటా రూ. 96,692 కోట్లుగా ఉంది. మిగిలిన 40 శాతం వాటా గ్రామాలది. ఈ విధానంలో ప్రతి గ్రామానికి ఏటా రూ. 50 లక్షలు, ఐదేళ్లలో రూ. 2.5 కోట్లు అందించడం జరుగుతుంది. ఇది గ్రామాభివృద్ధికి గట్టి మూలధనంగా చెప్పవచ్చు. ఏఐ ఆధారిత మానిటరింగ్, జియో ట్యాగింగ్, ఆధార్- బయోమెట్రిక్ హాజరు, రియల్ టైమ్ డాష్‌బోర్డులు, సోషల్ ఆడిట్లు తప్పనిసరి చేయడం ద్వారా అవినీతికి చెక్ పెట్టేందుకు అవకాశాలుంటాయి. పాత నరేగా ప్రకారమున్న 100 రోజుల పని దినాలను జీ రామ్ జీ ద్వారా 125 రోజులకు పెంచడం వెనుక అటవీ ప్రాంతాలకు అదనంగా పని దినాలు కల్పించినట్లవుతంది.

వేతనాల చెల్లింపు ఆలస్యమయితే వడ్డీ చెల్లించడంతో పాటు సాగు కాలంలో రైతులకు కార్మిక లోపం రాకుండా 60 రోజుల విరామం ఇవ్వడం కూడా జరుగుతుంది. మెరుగైన పర్యవేక్షణ, అవినీతి నియంత్రణ కోసం పరిపాలనా వ్యయాన్ని 6 నుంచి 9శాతానికి పెంచడం ద్వారా పరిపాలన బలోపేతమవుతుంది. అంతిమంగా ఎంజీనరేగా అనేది తన కాలానికి సరైనది. ఇప్పుడొచ్చిన వీబీ జీ రామ్‌జీ ఈ కాలానికి సరైనది. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా పరిగెడుతున్న దేశం 2005 కాలానికే కట్టుబడి ఉండదు. నిజమైన సామాజిక న్యాయం అంటే అంతులేని దానాలు కాదు.. గౌరవభరిత ఉపాధి, ఆస్తుల సృష్టి, ఆర్థిక స్వావ లంబన. అదే వీబీ జీ రామ్ జీ లక్ష్యం.

వ్యాసకర్త: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

బూర నర్సయ్య గౌడ్