25-01-2026 12:00:00 AM
తెలంగాణ ఏర్పాటుకు ముందు, తర్వాత రాష్ట్ర రాజకీయాలపై ఆంధ్ర నాయకుల ప్రభావం ఎందుకుందనే అనుమానాలకు ఇటీవల జరుగుతున్న పరిణా మాలు బలం చేకూర్చుతున్నాయి. సమైక్యాంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం (టీడీపీ) పార్టీ నుంచి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి గా పని చేసిన చంద్రబాబునాయుడు, కాం గ్రెస్ పార్టీని రెండు పర్యాయాలు గెలిపించి అధికారంలోకి తీసుకువచ్చిన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిలు ఆంధ్ర నాయకు లుగా గుర్తింపు పొందినా తెలంగాణలో కూడా బలమైన అనుచరగణం కలిగిన నా యకులుగా పేరు పొందారు. కానీ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన నాయకు లనే ముద్ర కూడా వీరిపై ఉంది. అయితే రాష్ర్టం ఏర్పాటైన తర్వాత కారణాలు ఏమై నా ఆంధ్ర మూలాలు ఉన్న తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు తెలంగాణ రాజకీయ చిత్రపటం నుంచి దాదాపు అంతర్లీనమైపోయాయి.
కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ తెలంగాణలో అధికారంలో ఉన్న తన పూర్వపు మిత్రుల సహకారంతో మన గడ్డపై కూడా రాజకీయంగా చక్రం తిప్పటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్‌ను ద్వేషించే క్రమంలో టీడీపీకి, ఆ పార్టీ నాయకులకు అనుకూలంగా మాట్లాడుతున్న మా టలు, నీటి పంపకాలు, ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల విషయంలో మెతక వైఖరిని చూస్తుంటే భవిష్యత్తు రాజకీయ అవసరాలు, ప్రయోజనాలేమైనా దాగి ఉన్నాయా అన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుంది.
అవాజ్య ప్రేమెందుకు?
రెండు కళ్ల సిద్ధాంతం, రెండు కొబ్బరి చిప్పల వేదాంతంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడ్డ పార్టీపై, నాయకులపై కాం గ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు ఎందుకు అంత అవాజ్య ప్రేమ అన్నది అర్థం కావడం లేదు. అంతేకాదు ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉ న్న నాయకులు తమ పార్టీకి వ్యతిరేకంగా పుట్టి దేశవ్యాప్తంగా ఫ్రంట్‌లు కట్టి గాంధీ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ నాయకుల పట్ల అనుకూలంగా మాట్లాడ టం మునుపెన్నడూ చూడని రాజకీయ వైచిత్రమని చెప్పొచ్చు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పా టుకు వ్యతిరేకంగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పనిచేసిన టీడీపీపై తనకున్న వాత్స ల్యాన్ని దాచుకోలేక బయటపడిపోతూ అటు కాంగ్రెస్ పార్టీలోనూ.. ఇటు తెలంగాణ ప్రజల్లోనూ అనుమానపు బీజాలు మొలకెత్తటానికి తాను కారణమనే విషయం అర్థమ వుతున్నా తెగింపుతో వ్యవహరించడానికి కారణం ప్రజలు ఇచ్చిన అధికారమే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీడీపీ, దాని నాయకత్వం పట్ల వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఒకప్పుడు తనకు అవకాశమిచ్చి ఆదరించిన పార్టీపై మమకారాన్ని చంపుకోలేకపోతున్నారా అనే అభిప్రాయం కలగక మానదు. కాంగ్రెస్‌ను ద్వేషించే బీజేపీతో భాగస్వామ్యం కలిగిన చంద్రబాబుపై కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా సానుకూలంగా స్పందించే తీరు రాజకీయాల్లో మొదటిసారి ఒక అర్థంకాని బం ధంగా కనిపిస్తున్నది.
ఇటీవలే రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో నా అభ్యర్థన మేరకే ఏపీ ముఖ్యమంత్రి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని నిలిపివేశారని సభలోనే రేవంత్ ప్రకటించడాన్ని చూస్తే ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య బంధాన్ని బయటపెట్టిందని చెప్పొచ్చు. అయితే వారు ప్రాతినిధ్యం వహించే పార్టీలు గతంలో తెలంగాణ ఏర్పాటు పట్ల వారి వైఖరి అనుమానించడానికి అవకాశం ఇస్తుంది. నిర్మాణంలో ఉన్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిన వారు ప్రతిపాదిత నల్లమల సాగర్ ఆపలేరా అనే ప్రశ్నకు రాజకీయాలకు అతీతంగా సమాధానం దొరకదు.
రీఎంట్రీ సాధ్యమా?
సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం నాలుగు పర్యాయాలు ఎన్నికల్లో గెలిచి 17 సంవత్సరాలు పాలన చేసింది. రాష్ర్టం విడిపోయే నాటికి శాసనసభలో బలమైన ప్రతి పక్షంగానే ఉన్నది. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన తర్వాత తెలంగాణ రాష్ర్టంలో జరిగిన మొదటి శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 14.7 ఓట్లు సాధించి 15 శాసనసభ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. కానీ అదే సమయంలో టీడీపీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడం, పార్టీ నుంచి గెలిచిన 13 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారటంతో తెలంగాణలో టీడీపీ బలహీనప డింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ వైరుధ్యాలను పక్కనపెట్టి బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు టీడీపీ, కాంగ్రెస్, సీ పీఎం, సీపీఐ, టీజేఎస్ పార్టీలు కలసి మహాకూటమిగా ఏర్పడినప్పటికీ ఆ కూటమికి దా రుణ ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చింది.
ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటు బ్యాంకు 3.5 శా తానికి పడిపోవడమే కాదు ఖమ్మం జిల్లాలో రెండు శాసనసభ నియోజకవర్గాల్లో మా త్రమే విజయం సాధించింది. ఆ తర్వాత ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించారు. 2023లో తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. రేవంత్ రెడి తో సహా కీలకమైన నాయకులు కాంగ్రెస్‌లోకి, మరికొం తమంది బీఆర్‌ఎస్‌లోకి వలస పోవడంతో తెలంగాణలో టీడీపీ మరింత బలహీనపడింది.
ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ టీడీపీ సానుభూతిపరులు ఖమ్మం జిల్లాలో నాలుగైదు చోట్ల విజయం సాధించారు. తెలంగాణలో ఒకటి రెండు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, సెటిలర్స్, సామాజిక వర్గానికి చెందినవారి మద్దతు ఉన్నప్పటికీ బలమైన నాయకులు, నాయకత్వం లేకపోవడం, తెలంగాణ వ్యతిరేక పార్టీగా ముద్ర పడటం, నీళ్ల విషయం లో ఇప్పటికే తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేయటం వల్ల టీడీపీకి తెలంగాణలో ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చే అవకాశం కనపడటం లేదు.
నష్టం ఎవరికి?
తెలంగాణలో టీడీపీ ఉండకూడదని కక్ష కట్టిన బీఆర్‌ఎస్‌ను వంద మీటర్ల గొయ్యి తీసి బొంద పెట్టాలని, ఆ పార్టీ నాయకులు గద్దె దిగాలని, పార్టీ దిమ్మెలు కులాలని కాంగ్రెస్ సీఎం రేవంత్ టీడీపీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆశిస్తున్నట్లుగా తెలంగాణలో టీడీపీ బలపడితే ఆ బలం ఏ పార్టీకి నష్టం చేస్తుందనేది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌కు ఏ విధంగా లాభమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డితో సహా కీలకమైన ఆయా జిల్లాల్లో బలమైన తెలుగుదేశం నాయకులు కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యేలుగా కూడా గెలిచారు.
మళ్ళీ ఇప్పుడు ఘర్ వాపసీలో భాగంగా టీడీపీలోకి వెళితే కాంగ్రెస్‌కే నష్టం! జాతీయ స్థాయిలో ఉన్న ఎన్డీఏ కూటమి పార్టీలు తెలంగాణలో జట్టుకట్టి ఎన్నికల్లో పోటీ చేస్తే వారందరూ ఏ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారు? రేవంత్ కాంగ్రెస్ పార్టీని, తన ప్రభుత్వాన్ని వేర్వేరుగా చూస్తున్నారా? తాను ఎక్కడ ఉన్నా రాజకీయ ప్రయోజనాలు దెబ్బ తినకుండా చూసుకుంటున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు మీడియా సంస్థల మధ్య ఉన్న వైరం, సీఎం వ్యవహార శైలితో కాంగ్రెస్‌లో ఒక స్పష్టమైన విభజన కనబడుతుంది. ఒరిజినల్ కాంగ్రెస్‌కు, పాత టీడీపీకి మధ్య దూరం పెరుగు తున్నట్లుగా అది భవిష్యత్తులో పార్టీ పైన ప్రభుత్వంపైన ప్రతికూల ప్రభావం చూపించేటట్లుగా కనపడుతుంది.
ఒక మీడియా అధినేత ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లి కలవడం, దావోస్ లాంటి అంతర్జాతీయ వేదిక పై ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మంత్రిని తెలంగాణ సీఎం కలవడాన్ని తెలంగాణ ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారో చూడాలి. తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే రాజకీయంగా నష్టం జరుగుతుందని భాగస్వామ్య బీజేపీ కూడా భయపడుతుంటే తెలంగాణ సీఎం మాత్రం టీడీపీకి అనుకూలమైన వ్యాఖ్యలు చేయటం ఆ పార్టీపై తనకు న్న ప్రేమను దాచుకోలేకపోవటం రాజకీయ రంగస్థలంపై నాటకం రక్తి కడుతుందా అన్నది చూడాలి.
వ్యాసకర్త సెల్: 9885465877
డాక్టర్ తిరుణహరి శేషు