23-10-2025 10:55:47 PM
ఇందిరా మహిళా శక్తి చీరల రెండవ విడత ఆర్డర్లను వెంటనే అందించి, పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులకు ఉపాధి కల్పించాలి
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): ఇందిరా మహిళా శక్తి చీరల వస్త్ర ఉత్పత్తిని పరిశీలించడానికి సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్ సిరిసిల్లకు రావడం జరిగింది ఈ సందర్భంగా పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ వద్ద సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్, జిల్లా అధ్యక్షులు కోడం రమణ ప్రభుత్వం పవర్లూమ్స్ అనుబంధ రంగాల కార్మికులకు ఉపాధి కల్పించడంలో భాగంగా టేస్కో ద్వారా సిరిసిల్లలో ఉత్పత్తి చేయిస్తున్న ఇందిరా మహిళా శక్తి చీరల మొదటి విడత ఆర్డరు ఇవ్వడం జరిగిందని దీనివలన కార్మికులకు ఉపాధితో పాటు మెరుగైన వేతనాలు వస్తున్నాయని ఈ ఆర్డర్ ప్రారంభంలో కొంత ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం ఉత్పత్తిలో వేగం పుంజుకుందని ఇప్పటికే దాదాపు 90% నికి పైగా వస్త్రం ఉత్పత్తి పూర్తయినందున వెంటనే రెండో విడత ఆర్డరు కూడా ఇప్పించి సిరిసిల్లలో పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులకు ఉపాధి కల్పించాలని వినతిపత్రం అందించారు.