calender_icon.png 24 October, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమీన్‌పూర్‌లో సదర్ సంబరాలు

23-10-2025 10:59:11 PM

పాల్గొన్న మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి..

అమీన్‌పూర్‌: అమీన్‌పూర్‌ మున్సిపల్ పరిధిలోని పెద్ద చెరువు సాయిబాబా గుడి సమీపంలో రాగం సోదరులు, జిల్లా పరిషత్ హై స్కూల్ సమీపంలో మెండే కుటుంబం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదర్ సంబరాల్లో మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదవులు దున్నపోతులను అందంగా అలంకరించి వివిధ విన్యాసాలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాండురంగారెడ్డి మాట్లాడుతూ... యాదవులు స్వతహాగా సేవాభావం కలిగి ఉంటారని, సమాజంలో తమకంటూ ప్రత్యేకతను ఎల్లప్పుడూ చాటుకుంటారని అన్నారు. యాదవుల సంక్షేమానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కృష్ణ, కొల్లూరు చంద్రకళ గోపాల్, కో ఆప్షన్ సభ్యులు తల్లారి రాములు,సీనియర్ నాయకులు కొల్లూరు యాదగిరి, దాసు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.