calender_icon.png 17 November, 2025 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛతీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్

17-11-2025 12:23:13 AM

ముగ్గురు మావోయిస్టుల మృతి

చర్ల, నవంబర్ 16:ఛతీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా దళాలతో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్‌లో కీలక మిలీషియా కమాండర్ మాద్వి దేవాతో సహా ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన వారిని జనమిలిషియా కమాండర్, స్నిపర్ స్పెషలిస్ట్ కొంటా ఏరియా కమిటీ సభ్యుడు మాద్వి దేవా,

కొంటా ఏరియా కమిటీ సీఎన్‌ఎం కమాండర్ పోడియం గంగి, కిష్టారాం ఏరియా కమిటీ సభ్యుడు సోడి గంగిగా గుర్తించామని, వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారని, ముగ్గురిలో ఒక్కొక్కరి తలపై రూ.5 లక్షల రివార్డు ఉందని ఎస్పీ తెలిపారు. సంఘటనా స్థలంలో 303 రైఫిల్, బీజీఎల్ లాంచర్లు సహా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు.