calender_icon.png 30 August, 2025 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రిడ్జి కింది ఆక్రమణలు తొలగించాలి

30-08-2025 12:28:00 AM

- 22 కానాలు తెరిపించాలి 

- బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్  

సిద్దిపేట, ఆగస్టు 29 (విజయక్రాంతి):సిద్దిపేట పాత బస్టాండ్ నుండి కొత్త బస్టాండ్ వెళ్లే మార్గంలోని ప్రధాన బ్రిడ్జి కింది ఆక్రమణలు తొలగించాలని బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ హైమావతిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో బావిస్ కానా (22 కానాల) బ్రిడ్జిగా పేరున్న ఆ బ్రిడ్జి నేడు ఆక్రమణలకు గురికావడంతో కేవలం మూడు, నాలుగు కానాలే ఉన్నాయన్నారు.

బ్రిడ్జ్ పరిసర ప్రాంతాల్లో ఆక్రమణల మూలంగా కానాలు మూసివేయడంతో వర్షాలు పడ్డప్పుడు వరద నీరు పోవడానికి దారి లేక పట్టణంలోని ప్రధాన రోడ్లతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజులపాటు కురిసిన భారీ వర్షాలకు పట్టణంలోని పలు కాలనీలు, ప్రధాన రోడ్లు జలమయం కావడానికి కారణం బ్రిడ్జి ఆక్రమణే అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే 22 కానాలు తెరిపిస్తే వరద నీటితో ఇబ్బంది ఉండదన్నారు.

ఎఫ్టిఎల్, బఫర్ జోన్లో లేఅవుట్ లకు పర్మిషన్ ఇవ్వద్దన్నారు. ఎఫ్టిఎల్, బఫర్ జోన్లో లేఅవుట్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు అధికారులు వర్షాభావ పరిస్థితులు దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఈ పర్మిషన్ల మూలంగా లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఏర్పరచుకుంటున్నవారు వర్షాలతో ఇబ్బందులు పడి నిరాశ్రయులు అవుతున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట తొడుపునూరి వెంకటేశం,రాజు తదితరులు పాల్గొన్నారు.