calender_icon.png 30 August, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలలో దేశం నంబర్ వన్‌గా నిలవాలి

30-08-2025 12:29:25 AM

మెదక్ ఎంపీ రఘునందన్ రావు 

సిద్దిపేట, ఆగస్టు 29 (విజయక్రాంతి): భారతదేశం జనాభాలో ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలుస్తుందని అట్లనే క్రీడలలో కూడా నెంబర్ వన్ గా నిలవాలని మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం జాతీయ క్రీడ దినోత్సవం పురస్కరించుకొని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నేషనల్ స్పోరట్స్ అథారిటీ, ఫిట్ ఇండియా సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఖేలో ఇండియా క్రీడలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

వయస్సు తో సంబంధం లేదని ప్రతి నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతంలోని క్రీడాకారులను గుర్తించేందుకు ఖేలో ఇండియా ప్రత్యేక క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆన్లైన్లో ద్వారా నమోదు చేసుకొని క్రీడలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజలు శారీరక, మానసిక దృఢత్వాన్ని కలిగి ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ క్రీడలు నిర్వహిస్తుందని తెలిపారు.రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మెదక్ పార్లమెంట్ పరిధిలో అనేక చెరువులు గండిపడడం, రోడ్లు ధ్వంసం అవడం వల్ల ప్రయాణాలకు, ప్రజలకు అంతరాయం కలిగిందన్నారు. అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు.

సిద్దిపేటలోని శ్రీనగర్ కాలనీ, హరిప్రియ నగర్ లో ఇల్లు నీటమునడం బాధాకరమని, నాలా పరిధిలో ఇల్లు నిర్మించుకోవడానికి అనేక విధాలుగా చూసి అనుమతులు పొందాలన్నారు. లేఅవుట్ కు అనుమతులు ఇచ్చేముందు ఎఫ్టిఎల్, బఫర్ జోన్ వంటివి పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. మెదక్ పార్లమెంటు పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడం వల్ల ఇద్దరి ప్రాణాలు పోయాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, వివిధ శాఖల అధికారులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, స్పోరట్స్ క్లబ్ అధ్యక్షులు పాల సాయిరాం, బిజెపి జిల్లా అధ్యక్షులు శంకర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.