calender_icon.png 2 October, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

02-10-2025 12:00:00 AM

పబ్బ నగేష్ గుప్తా

చేగుంట అక్టోబర్ 01,విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతీ సం ప్రదాయాలకు,ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని పబ్బ నగేష్ గుప్తా అన్నారు. బుధవారం చేగుంట మండలంలో ని చందాయిపేట గ్రామంలో ఏర్పా టు చేసిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ఆడబిడ్డలతో కలిసి ఆడి పాడా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగా ణ సంస్కృతి, సంప్రదాయాలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ప్రజలంతా సంతోషంగా జరుపుకున్నారన్నారు.

ఎంగిలి పూలతో ప్రారంభమై, సద్దుల బతుకమ్మతో శోభాయమానంగా ముగిసిన ఈ తొమ్మిది రో జులు ఆడపడుచుల ఆనందాల ఉత్సవమన్నారు.  ఈ కార్యక్రమంలో గ్రామస్తులు శోభన్, బలేష్, లక్ష్మణ్, రామక్రిష్ణ, మచ్చ శ్రీనివాస్, ప్రదీప్, సా యిబాబా, ఎల్లమేశ్వర్,తదితరులు పాల్గొన్నారు.