calender_icon.png 2 October, 2025 | 6:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాథమిక వెటర్నరీ కేందం ఆకస్మిక తనిఖీ

02-10-2025 12:00:00 AM

నార్సింగి /చేగుంట అక్టోబర్ 01 (విజయక్రాంతి ) : నార్సింగి మం డల కేంద్రంలోని ప్రాథమిక వెటర్నరీ సెంటర్ ను జిల్లా పశు వైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎస్.వెంకటయ్య ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆసుప త్రిలోని మందుల, వాక్సినేషన్ రికార్డులను, మందుల నిల్వలు తదితర వాటిని పరిశీలించారు. అనంతరం డాక్టర్ ఎస్ వెంకటయ్య మాట్లాడుతూ, ఆసుపత్రి పని తీరు కోసం ఆకస్మిక పర్యటన చేసినట్లు తెలిపారు.

పర్యటనలో భాగంగా ఆసుపత్రిలోని పలు రికార్డులను, ఇటీవల సరఫరా జరిగిన మందుల నిల్వలు, పరిసరాలను పర్యవేక్షించడం జరిగిందని, మండల పశు వైద్య అధికారి డాక్టర్ సుధాకర్, సిబ్బంది పని తీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. వర్షా కాలంలో జీవాలు, పశువుల లో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువ అని, వాటికి సంబంధించిన అన్ని రకాల మందులు, కేంద్రం లో అందుబాటులో ఉన్నాయని అన్నారు.

ఇటీవలే జిల్లాకు 42 లక్షల మందులు వచ్చాయని, అలాగే గొర్రెలు, జీవాల కోసం డివోర్మింగ్, మందులు కూడా వచ్చాయని, త్వరలోనే అన్ని మండలాలలో డివోర్మింగ్, కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. సాధారణంగా వర్షా కాలంలో జీవాలలో వచ్చే పీపీఆర్, షిపాక్స్, ఎల్‌ఎస్డీటీ కు సంబంధించిన టీకాలు కూడా కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని, పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాల మిత్ర ఫజల్, అటెండర్ స్వామి ఉన్నారు.