06-08-2025 01:28:11 AM
గోదావరిఖని ఆగస్టు 05 (విజయక్రాంతి) గోదావరిఖని 1-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను పోలీసులు గుర్తించగా రెవిన్యూ శాఖ సీజ్ చేశారు.గోదావరిఖని 1- టౌన్ పో లీస్ స్టేషన్ పరిధి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు సంజయ్ గాంధీ నగర్ లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 130 ట్రాక్ట ర్ ల ఇసుక డంపులను గుర్తించారు.
సంజ య్ గాంధీ నగర్ లో గుర్తుతెలియని వ్యక్తులు అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక డం పు నిల్వ ఉంచిన విషయంపై గోదావరిఖని 1-టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి, రామగుం డం తహసీల్దార్ కు సమాచారం అందించగా వెంటనే ఆర్‌ఐ ని పంపగా వారి సమక్షంలో అక్రమంగా నిల్వ ఉన్న ఇసుకను సీజ్ చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సిజ్ చేసిన తదుపరి విచారణ తరువాత వేలం వే సి వచ్చిన ఆదాయం ను ప్రభుత్వం ఖజానా కు పంపించారు.
ఈ సందర్భంగా సిఐ మా ట్లాడుతూ...రామగుండంలో స్థానిక ఎమ్మె ల్యే, కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజల స్థానిక అవసరాలకు గోదావరి నుంచి ఇసుక తీసుకునేలా కల్పించిన వెసలుబాటును కొంత మంది అక్రమార్కులు వారి స్వలాభం కో సం దుర్వినియోగం చేస్తూ అధిక లాభం కో సం ఇసుక అక్రమంగా తరలించి డంపులు గా పోసి అక్రమార్జన కోసం ఇతర ప్రాంతాలకు తరలించడం జరుగుతుందని సీఐ తెలి పారు. ఇది చట్టరీత్యా నేరమని, అక్రమంగా ఇసుక రవాణా చేసిన డంపుగా నిలువచేసిన ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఐ ఇంద్రసేనారెడ్డిహెచ్చరించారు.