calender_icon.png 24 October, 2025 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంఘిక దురాచారాలను రూపుమాపండి

23-10-2025 10:22:00 PM

ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాడ్..

ఖానాపూర్ (విజయక్రాంతి): సమాజంలో సాంఘిక దురాచారాలను రూపుమాపాలని అందుకోసం ప్రతి ఒక్కరూ చైతన్యవంతం కావలసిన అవసరం ఉందని ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాడ్ అన్నారు. గురువారం ఖానాపూర్ మండలంలోని బాదనకుర్తి గ్రామంలో ప్రజలకు మూఢనమ్మకాలపై అవగాహన చైతన్య కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మంత్రాలు, చేతబడులు అంటూ ప్రజలు భయపడకూడదని, ధైర్యంగా ఉండి సమాజ హితవు కోసం బ్రతకాలని, ఒకరికి ఒకరు సహాయం చేయడం చాలా మంచిదని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ ప్రజలు పలువురు పాల్గొన్నారు.