23-10-2025 10:18:44 PM
బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుండి 150 మంది కాంగ్రెస్ లో భారీ చేరికలు..
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు..
కామారెడ్డి (విజయక్రాంతి): ప్రతి పేదవానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి లబ్ధి చేకూర్చుతానని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం వజ్రఖండి గ్రామంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు రాంపటేల్, రాములు, బీఆర్ఎస్ నాయకులు హన్మంతరావు పటేల్,సంతోష్ రెడ్డితో పాటు గ్రామానికి చెందిన సుమారు 150 మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ వజ్రఖండి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే గాక గ్రామంలోని హనుమాన్ మందిరం అభివృద్ధికి కూడా తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం విద్యా, వ్యవసాయం, పేదల సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తుందని ఎమ్మెల్యే అన్నారు.ప్రతీ పేదవాడికి ప్రభుత్వం యొక్క సంక్షేమ ఫలాలు అందించి లబ్ది చేకూర్చుతానని తెలిపారు.