calender_icon.png 21 November, 2025 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత రాజ్యాంగం విశిష్టతపై వ్యాసరచన పోటీలు

21-11-2025 12:12:53 AM

భీమదేవరపల్లి, నవంబర్ 20 (విజయక్రాంతి) భీమదేవరపల్లి భారత రాజ్యాంగం విశిష్టతపై హుస్నాబాద్ జేఏసీ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు హుస్నాబాద్ జేఏసీ చైర్మన్ కవ్వా లక్ష్మారెడ్డి, భీమదేవరపల్లి జేఏసీ చైర్మన్ డేగల సారయ్య లు తెలిపారు. ముల్కనూర్ ఎస్ ఆర్ టి కళాశాలలో కరపత్రాన్ని నాయకులు గురువారం విడుదల చేశారు.

ఈనెల 22న ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ముల్కనూర్ ఎస్ ఆర్ టి కళాశాలలో వ్యాసరచన పోటీలు ఉంటాయన్నారు. 24న ముల్గనూరులో ఏర్పాటు చేస్తున్న రాజ్యాంగ విశిష్టత అనే అంశంపై సదస్సులో కాకతీయ యూనివర్సిటీ లా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిమ్మ సుదర్శన్ ప్రసంగం ఉంటుందన్నారు. 26న హుస్నాబాద్ నియోజకవర్గస్థాయి సదస్సులో హైదరాబాద్ సల్పార్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హెచ్ వాగిషన్ ప్రసంగం ఉంటుందన్నారు.

వ్యాసరచన పోటీల విజేతలకు అతిథులచే బహుమతి ప్రధానం ఉంటుందన్నారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెప్యల ప్రకాష్, రేణికుంట్ల బిక్షపతి, డాక్టర్ ఏదులాపురం తిరుపతి, చుంచు ఐలయ్య, ఎదులాపురం మొగిలి, గాండ్ల పద్మ, వేముల జగదీష్, పెట్టెం కుమారస్వామి, తాళ్లపల్లి ప్రభాకర్, ఎల్బీ మల్లేశం, ఎస్ డి మసూద్ పాల్గొన్నారు.