calender_icon.png 21 November, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే పాయం

21-11-2025 12:12:53 AM

మణుగూరు, నవంబర్ 20 (విజయక్రాం తి) : మండలంలోని ముత్యాలమ్మ నగర్ గ్రా మంలో 20 లక్షల అంచనా వ్యయంతో ని ర్మించనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటే శ్వర్లు గురువారం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడు తూ, ప్రతి పేద కుటుంబానికి రేషన్ షాపు ల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఘనత కాం గ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుం దన్నారు.

ప్రతి గ్రామంలో మౌలిక వసతు లు కల్పించడం జరుగుతుందని, ఇండ్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిర మ్మ ఇండ్లను మంజూ రు చేస్తుందన్నారు. ప్రతి కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి సా రధ్యంలోని ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకా లు అందుతాయని, గత ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరో పించారు. అనంతరం వైఎస్‌ఆర్ నగర్ లో పలు సిసి రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించా రు.

ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ అద్దం కి నరేష్, ఎంపీఓ వెంకటేశ్వరరావు,మండ ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పీరినాకి నవీన్, బోనగిరి శివ సైదులు, యూత్ కాం గ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కూరపాటి సౌజ న్య ,కృష్ణంరాజు,శివాలయం చైర్మన్ కూచి పూడి బాబు, రహీంపాషా,ఈశ్వర్ రెడ్డి , గ్రామస్తులు పాల్గొన్నారు.