22-11-2025 01:27:13 AM
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి, నవంబర్ 21 ( విజయక్రాంతి ) : పరిపాలనను ప్రజల చెంతకు తెచ్చిన ఘనత మాజీ సి ఎం కె.సి.ఆర్ ది అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రెవెల్లి మండల స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంను శుక్రవారం నాగపూర్ గ్రామములో నిర్వహించారు. ఈ కార్యక్రమం కు ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ఆరు గ్యారంటీలు 420హామీలు ఇచ్చి ఒక్కటంటే ఒక్కటి అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతికత లేదని గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు.
కె.సి.ఆర్ తెలంగాణ సాధించిన తర్వాత ప్రణాళిక బద్దంగా రాష్ర్ట అభివృద్ధి సాధించారని రైతాంగానికి సాగునీళ్లు, ఉచిత కరెంట్, పెట్టుబడి సాయం చేస్తూ కోటి ఎకరాలకు సాగు నీరు అందించారని కొనియాడారు ఉత్పత్తులు పెరిగి జీవనోపాధి కలిగి రైతులు రాజులా బ్రతికారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా రైతు రుణ మాఫీ రైతు బీమా అందకు సాగునీళ్ళు, కరెంట్ అందక 700మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశములో నాగం.తిరుపతి రెడ్డి, జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, మాజీ జెడ్.పి.టి.సి. భీమన్న, మాజీ ఎం.పి.పి సేనాపతి,మాజీ వైస్ ఎం.పి.పి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.