calender_icon.png 9 May, 2025 | 8:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీకి అందరూ సమానమే

08-05-2025 01:01:49 AM

- కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు

- ప్రతి పదవీకి ఐదు అప్లికేషన్లు స్వీకరణ

- పదవుల కోసం కాదు..పనిలో పోటీ పడాలి

- టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాహెర్ బిన్ హందన్

ఆదిలాబాద్, మే 7 (విజయక్రాంతి): జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో గ్రామ, మండల, బ్లాక్, పట్టణ, జిల్లా అధ్యక్ష పదవులను భర్తీ చేసేందుకు ఆశావహుల నుండి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు టీపీసీసీ ఉపాధ్యక్షులు పరిశీలకులు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్ పేర్కొన్నారు.

పార్టీ కోసం కష్టపడి, పార్టీ  జెండాను మోసిన వారికే ప్రాధాన్యత ఉంటుందన్నారు. జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గల కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశాల్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాహెర్ బిన్ హందన్ మాట్లాడుతూ..  పార్టీ విషయంలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదని పార్టీకి అందరూ సమానమేని, ఎవరి మనసులో ఏదైనా కల్మషముంటే వెంటనే దాన్ని తొలగించుకోవాలన్నారు. 

పార్టీలో ఉంటూ పార్టీ కోసం కష్టపడి పని చేసే నాయకులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రతీ పదవికి ఐదు చొప్పున అప్లికేషన్లు స్వీకరించి అధిష్టానానికి పరిశీలనకు పంపుతామన్నారు. అనంతరం అధిష్టానం నిర్ణయం మేరకు పదవుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంద న్నారు. నాయకులు పదవులు కోసం కాకుం డా పనిలో పోటీ పడాలని, అప్పుడు మంచి కార్యకర్తగా గుర్తింపు వస్తుందన్నారు. పార్టీ ఆదేశాను సారం పని చేయాలని పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా కార్యకర్తల ప్రవర్తన ఉంటే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, మాజీ ఎంపీ సోయం బాపురావు, ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ ఇంచార్జీ లు కంది శ్రీనివాస్ రెడ్డి, ఆడే గజేందర్, ఏఐసీసీ సభ్యులు నరేష్ జాదవ్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్, పట్టణ అధ్యక్షులు గుడిపల్లి నగేష్, ఐఎన్టియూసి జిల్లా అధ్యక్షులు మునిగేల నర్సింగ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి రంగినేని శాంతన్ రావు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సాయి చరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.