19-08-2025 12:00:00 AM
రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తల డిమాండ్
ముషీరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాం తి): ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పెండింగ్ నిధులను వెంటనే చెల్లించాలని పలువురు వక్తలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. ఈ మేరకు సోమవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజా సంఘాల రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐఏ డబ్ల్యూ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు, డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి. శంకర్, తెలంగాణ రైతు సంఘం ప్రతినిధి మూడు శోభన్, పిఎంసి నాయకులు ఎస్. శివలింగం, టీవీ వియు ప్రతినిధి వెంకటయ్యలు మాట్లాడుతూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 4,13,658 మందికి రూ. 248 కోట్ల 19 లక్షలు పెండింగ్ డబ్బు లు చెల్లించాలన్నారు.
అర్హుల ఎంపిక పారదర్శకంగా జరగలేదని, వెంటనే పారదర్శకంగా ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. ఎకరం భూమి కలిగిన వారితో పాటు లోపు ఉన్న వారి పరిస్థితి దయనీయంగా ఉందని, వీరిని కూడా ఎంపిక చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామసభల ద్వారా అర్హులతో దరఖాస్తుల స్వీకరించి రూపాయలు12 వేలు చెల్లించాలన్నారు.
ఆగస్టు 25 లోపు అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, 28 నుండి సెప్టెంబర్ 5 వరకు అన్ని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని, సెప్టెంబర్ 5 నుండి చివరి వరకు మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో రైతు స్వరా జ్య వేదిక నాయకులు రవి, కొండల్ రెడ్డి, బి. ప్రసాద్, పద్మ తదితరులు పాల్గొన్నారు.