02-01-2026 12:00:00 AM
న్యూయార్క్, జనవరి 1 : న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ కొత్త సంవత్స రం రోజున గురువారం ప్రమాణస్వీకారం చేశారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ ప్రమాణ స్వీకారం చేయిం చారు. మమ్దానీ తన మొదటి ప్రమాణ స్వీకా ర వేడుకను అత్యంత విభిన్నంగా నిర్వహించారు. మన్హటన్ భూగర్భంలో 1945 నుంచి మూసివేసి ఉన్న చారిత్రక ’ఓల్ సిటీ హాల్ సబ్వే స్టేషన్’ను ఈ వేడుకకు వేదికగా ఎంచుకున్నారు.
‘ఈ నగరాన్ని నడిపించే శ్రామిక వర్గం పట్ల నాకున్న గౌరవానికి ఇది సంకే తం‘ అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటి టియా జేమ్స్ సమక్షంలో, తన కుటుంబ స భ్యుల మధ్య ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. అమెరికా చరిత్రలో తొలిసారిగా ఖు రాన్‌పై చేయి వేసి ప్రమాణం చేయడం ఇదే తొలిసారి. “ఇది నిజంగా జీవితకాల గౌర వం, ప్రత్యేకత” అని మమ్దానీ పేర్కొన్నారు.
ముస్లిం వ్యక్తి తొలిసారిగా..
భారత సంతతికి చెందిన 34 ఏళ్ల మమ్దానీ డెమొక్రాట్ పార్టీ నుంచి న్యూయార్క్ మేయర్‌గా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందాడు. అమెరికా చరిత్రలో ఒక ముస్లిం వ్యక్తి అతిపెద్ద నగరమైన న్యూయార్క్‌కు మేయర్‌గా ఎన్నిక కావడం ఇదే తొలిసారి. ఈ పదవిని చేపట్టిన తొలి దక్షిణాసియా వ్యక్తిగా.. తొలి ఆఫ్రికన్ సంతతి వ్యక్తి ఇతడే కావడం విశేషం. మమ్దానీ పూర్వీకులంతా ఎక్కువ మంది బైబిల్ మీదే ప్రమాణం చేశారు.
వాస్తవానికి రాజ్యాంగ బద్ధమైన ప్రమాణానికి ఏ మతపరమైన గ్రంథాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. కానీ మమ్దానీ భార్య రమా దువాజీ సూచన మేరకు ఖురాన్‌పై ప్రమాణం చేశారు. ఈ చారిత్రక ఘట్టం కోసం మమ్దానీ మూడు పవిత్ర ఖురాన్ ప్రతులను ఉపయోగించారు. అందులో ఒకటి తన తాతగారికి చెందిన ఖురాన్ ప్రతి కాగా, రెండోది 18వ శతాబ్దానికి చెందిన, నల్లజాతీయుల చరిత్రను ప్రతిబింబించే అర్టురో షోంబర్గ్ సేకరించిన అత్యంత అరుదైన ఖురాన్ ప్రతి. మూడోది తన నానమ్మ ఖురాన్ ప్రతిని కూడా ఆయన ఉపయోగించారు.