calender_icon.png 12 August, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఆర్ విధానాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి

12-08-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి టౌన్, ఆగస్టు 11 : ఇటీవల కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా మనుషులు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారని, ఇలాంటి విపత్కర పరిస్తితుల్లో ప్రాణాలు కాపాడగలిగె సి. పి.ఆర్. (కార్డియాక్ పల్మనరి రిసెక్రియేషన్) విధానాన్ని ప్రతి ఒక్కరు నేర్చుకొని అవసరం ఉన్నప్పుడు ప్రయోగించి సాటి మనిషి ప్రాణాలు కాపాడాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధికారులకు డాక్టర్ ర ఘు సి.పి.ఆర్ పై నమూనా శిక్షణ ఇచ్చారు.  అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. కీమ్య నా యక్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇ న్చార్జ్ యాదయ్య అడిషనల్ ఎస్పీఆర్ వీరారెడ్డి ఆర్డిఓ సుబ్రహ్మణ్యం జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ శ్రీనివాసులు ప్రోగ్రాం అధికారి డాక్టర్ రామచంద్రరావు, మహబూబ్ నగర్ వైద్య విభాగం నుండి డా. రఘు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.. 

సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకం

వనపర్తి, ఆగస్టు 11 ( విజయక్రాంతి ): సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐజేయు) నూతన జిల్లా కమిటీ ఏర్పాటు అయిన సందర్బంగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాధవరావు, బి. రాజు ఆధ్వర్యంలో జర్నలిస్ట్ లు సోమవారం జిల్లా కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టర్ ను సన్మానించి, మెమోంటో అందజేశారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు. జర్నలిస్టులు నీతి, నిబద్ధత తో పని చేయాలని ఎలాంటి పక్షపాత ధోర ణి అవలంభించకుండా వాస్తవాలను ప్రతిబింబించే విధంగా వార్తలు రాయాలని సూ చించారు.

జర్నలిస్టులకు ఇంటి స్థలాల కేటాయింపు విషయంపై జిల్లా అధ్యక్షుడు మా ధవ రావు కలెక్టర్ దృష్టి కి తీసుకురాగా త్వర లో పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇ చ్చారు. ఈ కార్యక్రమంలో జి ల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాధవ రావు, బి రాజు, జిల్లా కోశాధికారి ద్యారపోగు మన్యం, ఉపాధ్యక్షులు నాకొండ యాదవ్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, కార్యదర్శులు చీర్ల ఆంజనేయులు, నరసింహారాజు, కోశాధికారి అరుణ్ కుమార్, నియోజకవర్గ అధ్యక్షుడు విజయ్ కుమార్, వనపర్తి టౌన్ అధ్యక్షుడు తైలం అరుణ్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.