calender_icon.png 19 September, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైగల భాష అందరూ నేర్చుకోవాలి

19-09-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి 

కరీంనగర్, సెప్టెంబరు 18 (విజయ క్రాంతి): సైగల భాష అందరూ నేర్చుకోవాలని, ప్రపంచమంతా యూనివర్సల్ గా ఒకే సైన్ లాంగ్వేజ్ ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. అంతర్జాతీయ సైన్ లాంగ్వేజి వారోత్సవాలు ఈనెల 22 నుండి 28 వరకు నిర్వహించనున్నారు. విద్యానగర్లోని ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో ముందస్తు అంతర్జాతీయ సైన్ లాంగ్వేజి దినోత్సవం గురువారం నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భాషలు లేని కాలంలో సైగల ద్వారానే కమ్యూనికేషన్ ఉండేదని తెలిపారు. అందువల్ల సైన్ లాంగ్వేజిని చిన్నచూపు చూడొద్దని అన్నారు. ప్రపంచమంతా ఒకే సైన్ లాంగ్వేజి ఉండడం ద్వారా అంతర్జాతీయంగా దివ్యాంగులకు ఎంతో మేలు జరుగుతుందని సూచించారు.

దివ్యాంగుల భావాలను అర్థం చేసుకొని వారితో మెరుగైన కమ్యూనికేషన్ ఉండాలనే ఉద్దేశంతో జిల్లాలో అక్షయ్ ఆకృతి ఫౌండేషన్ ద్వారా అధికారులకు, ఉత్సాహం ఉన్నవారికి సైన్ లాంగ్వేజి నేర్పిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ భాష నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే.వెంకటేష్, ఎన్.ఐ.ఈ.పి.ఐ.డి బాధ్యులు డాక్టర్ హిమాన్షు, ప్రియాంక, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, జి సి డి ఓ కృపారాణి, తహసిల్దార్ నరేందర్, బధిరుల పాఠశాల ప్రిన్సిపాల్ కమలపాల్గొన్నారు.