calender_icon.png 19 September, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్జేడీ సార్.. జెర దేఖో

19-09-2025 12:00:00 AM

  1. అనుమతులు ఇక్కడ.. నిర్వహణ అక్కడ

విచారణ చేయకుండానే ఒకే అంటున్న అధికారులు 

పిల్లల జీవితాలతో ప్రైవేట్ పాఠశాలల చెలగాటం

లక్షల్లో చేతులుమారుతున్నవైనం

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 18, (విజయక్రాంతి):దున్నపోతు ఈనింది అంటే దొడ్లో కట్టేయండి.... అన్నట్లు ఉంది జిల్లా వి ద్యాశాఖ అధికారుల పనితీరు. అసలు దున్నపోతు ఏనుతుందా అనేది కూడా పరిశీలన లేకుండా ఆదేశాలు జారీ చేస్తున్నారంటే వా రి పనితీరును తారేఫ్ చేయాల్సిందే.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో ని నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నర్సరీ నుంచి పదవ తరగతి వరకు విద్యా బోధన చేయడానికి విద్యాశాఖ అధికారులు అనుమతులు ఇచ్చారు. అనుమతులు ఇచ్చే సమయంలో వారు సమర్పించిన డాక్యుమెంట్లు పరిశీలించకుండా, క్షేత్రస్థాయి తని ఖీలు చేయకుండా, అడిగినంత పుచ్చుకొని కార్యాలయంలో కూర్చుని అనుమతులు ఇ వ్వడం, ఉన్నతాధికారులకు సిఫారసు చేయడం చేస్తున్నారు.

అందుకు నారాయణ పాఠశాల అనుమతుల తీరే తేటతెల్లం చేస్తుంది. ఒకవైపు విద్య వ్యాపారంగా మార్చి దండుకుంటున్నారని విద్యార్థి సంఘాలు విద్యార్థి తల్లిదండ్రులు లబోదిబోమని మొత్తుకుంటు న్న, అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా నారాయ ణ ఇంగ్లీష్ మీడియం అనుమతులలో అనేక లోపాలు వెలుగు చూశాయి. 

తప్పుడు అడ్రస్‌తో అనుమతి 

నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నిర్వహణ పాల్వంచ పట్టణం లోని నెహ్రూ నగర్ లో నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలకు నర్సరీ నుంచి ఐదవ తరగతి వరకు డీఈవో, ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఆర్జేడి అనుమతులు ఇచ్చారు. అనుమతులు అయితే ఇచ్చారు కానీ నిబంధనలు తుంగ లో తొక్కారు. ప్రైవేటు పాఠశాల అనుమతు ల సమయములో వారు సమర్పించిన ప త్రాలను క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సి ఉం ది.

సమీప ప్రభుత్వ పాఠశాలల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంది. వాటిని పొందకుండానే, క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే ప్రైవేటు పాఠశాలలకు అనుమతు లు ఇచ్చారు. 20 - 5- 52/11 ఇంటి నెంబర్తో నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల అనుమతులు పొందారు. వాస్తవంగా ఆ ఇం టి నెంబర్ కాంట్రాక్ట్ కాలనీలో కేఎల్‌ఆర్ ఫా ర్మర్స్ కాలేజ్ కొనసాగుతోంది. పాఠశాల ని ర్వహణ మాత్రం నెహ్రూ నగర్ లో నిర్వహిం చ బడుతోంది.

ఈ తీరు నక్కకు నాగలో కాని కి ఉన్నంత వ్యత్యాసం ఉంది. మూడు కిలోమీటర్ల వ్యత్యాసం కలిగి ఉంది. అనుమ తులు ఇచ్చే సమయంలో మండల విద్యాధికారి క్షేత్రస్థాయి పరిశీలన చేయడం లేదనేది స్పష్టం అవుతుంది. నాలుగు గోడల మధ్య కూర్చొని ప్రాథమిక పాఠశాల అనుమతి కో సం డీఈఓ కో సిఫారసు చేసినట్లు, డీఈవో సైతం ఉన్నత పాఠశాల అనుమతికి ఆర్జేడి కె సిఫారసు చేసినట్లు స్పష్టమవుతుంది.

అధికారుల సిఫారసునే పరిగణలోకి తీసుకొని ఉ న్నత పాఠశాలకు 2023- 24 విద్యా సంవత్స రం నుంచి 2032- 34 విద్యా సంవత్సరం వరకు లెటర్ నెంబర్ బి హెచ్ డి - పి ఎల్ డ బ్ల్యూ సి - 0190012, తేదీ 25 - 11- 2023 న అనుమతులు ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలకు డిఇఓ 2023- 24 విద్యా సంవత్సరము నుంచి 2027- 28 విద్యా సంవత్సరం వరకు ఆనమతులు జారీ చేశారు.

పాఠశాల అనుమతులపై వచ్చిన ఫిర్యాదు మేరకు గత ఏ డాది జూలైలో విజయ క్రాంతి లో శీర్షిక ప్ర చురిచితమైన అధికారులు మాత్రం ఎలాంటి పరిశీలన చేయకుండా గుడ్డిగా అనుమతులు ఇవ్వటం అడిగినంత ఇచ్చుకో అనుమతులు పుచ్చుకో అనే ఆరోపణలు ధ్రుపరుస్తుంది. 

ఎన్‌ఓసితో పని ఏంటి. ...

ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుంటే , మరోవైపు క్షే త్రస్థాయిలో అధికారులు మాత్రం అక్రమాలకు పాల్పడుతూ పుట్టగొడుగుల్లా ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇస్తున్నారనే ఆ రోపణలు నారాయణ పాఠశాల అనుమతు ల్లో వెళ్లడైంది. నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాల అనుమతుల సమయంలో (ఓపెనింగ్ పర్మిషన్) సమీపంలో మూడు కిలోమీ టర్ల వరకు ప్రభుత్వ పాఠశాలలో ఉంటే అ నుమతి ఇవ్వరాదనీ,

అనుమతులు ఇవ్వాల్సి వస్తే తప్పనిసరిగా సమీప ప్రభుత్వ పాఠశాలల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందాల ని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. నారాయణ పాఠశాల అనుమతుల సమయము లో అధికారులు నిబంధనలను తుంగలో తొక్కినట్లు స్పష్టంగా వెళ్లడవుతోంది. ఒక వి ద్యాశాఖ అనే కాకుండా పోలీస్, ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ విభాగం, మున్సిపల్ అధికారులను సైతం తప్పుదోవ పట్టించారు.

ప్రవే ట్ పాఠశాల సమీపంలోనే ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతున్నాయి. నారాయణ పాఠ శాల అనుమతుల్లా కు సంబంధించిన ఫైలు డీఈవో కార్యాలయంలో లేకపోవడం గమనార్హం. పాఠశాలకు అదే సమీపంలో వికలాంగుల ప్రాథమికోనత పాఠశాల, రాత్రి చెరువు బంజర్ ప్రాథమికోన్నత పాఠశాల, ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల లు ఉన్నాయి.

ప్రవేటు పాఠశాలకు అధికారులు అనుమతులు ఇచ్చే సమయంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంది. అధికారులు వాటిని పరిగణలోకి తీసుకోకుండా ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇవ్వడంతో ప్రభుత్వ పాఠశాలలభ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయిందని తెలుస్తోంది.

పాఠశాల అనుమతుల పై వచ్చి న ఆరవణ లపై డీఈఓ కార్యాలయం నుంచి అనుమతులకు సంబంధించిన ఓపెనింగ్ ఫైల్ సమర్పించాలని డీఈఓ ఆదేశించిన మండల విద్యాధికారి, పాఠశాల యాజమాన్యం పెడచెవిన పెట్టడం విశేషం . దీంతో పాఠశాల అనుమతులు అక్రమంగా పొందినట్లు తెలుస్తోంది. ఏదో వెలుగులోకి వచ్చిన ప్రైవేటు పాఠశాల అనుమతుల తీరు. ఇలాంటి పాఠశాలలు జిల్లాలో కోకోలలుగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు భద్రాద్రి కొత్తగూ డెం జిల్లాలో నిబంధనల అతిక్రమించి నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశా లలపై క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని, నిబంధనలను తుంగలో తొక్కి అనుమతులు పొందిన నారాయణ పాఠశాల అనుమతుల రద్దు చేయాలని, అందుకు సహకరించిన అధికారులపై పూర్తిస్థాయి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు, విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు.

విచారించి చర్యలు తీసుకుంటాం 

అనుమతులు ఒకచోట నిర్వహణ మరోచోట అనే అంశంపై జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి ని వివరణ కో రగా విషయం నా దృష్టిలో లేదని, విచారణ చేసి చర్యలు తీసుకుంటానన్నారు.

డీఈఓ నాగలక్ష్మి