29-07-2025 04:22:32 PM
కాగజ్ నగర్ (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కాగజ్ నగర్ అటవీ డివిజన్ ఎఫ్ఆర్ఓ అనిల్ కుమార్(Forest Division FRO Anil Kumar) అన్నారు. మంగళవారం ఏకలవ్య మోడల్ స్కూల్లో అంతర్జాతీయ పులుల దినోత్సవం పురస్కరించుకొని మొక్కలు నాటారు. అడవుల ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.