calender_icon.png 24 December, 2025 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యతతో పనులు నిర్వహించాలి

29-07-2025 04:27:14 PM

కలెక్టర్ కుమార్ దీపక్..

మంచిర్యాల (విజయక్రాంతి): నాణ్యత పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) కోరారు. మంగళవారం పట్టణంలోని పాత మంచిర్యాలలో నిర్మాణంలో ఉన్న మహిళా శక్తి భవన్ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులను సమీక్షిస్తూ నిర్మాణ పనుల పురోగతిపై ఇంజనీర్లు, అధికారులతో చర్చించారు. నాణ్యతపై గట్టి ఆదేశాలు ఇచ్చారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచుతూ, నిబంధనలు పాటించాలని ఆదేశించారు. కూలీల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శక్తి భవన్‌ ద్వారా మహిళలకు శిక్షణలు, సమావేశాల వేదికలు, ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. అనంతరం పాత మంచిర్యాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(ZPHS)ను సందర్శించారు. పాఠశాల తరగతులలో విద్యార్థుల హాజరు, బోధన గురించి వాకబు చేశారు.