26-08-2025 12:00:00 AM
మేకల ఎల్లయ్య :
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడం ఈసీ బాధ్యత. మన దేశంలో 2004 నుంచి దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వినియోగం మొదలైంది. దీనికి ప్రధాన కారణం అంతకుముందు బ్యాలెట్ పేపర్ల కాలంలో జరిగిన భారీ మోసాలు. బూత్ క్యాప్చరింగ్, బలవంతపు ఓటింగ్, ఒకే వ్యక్తి బండిల్‌గా ఓట్లు వేయడం వంటి అక్రమాలు చాలా ఎక్కువగా జరిగేవి. ఈవీఎంల ప్రవేశం దేశంలో ఎన్నికల మో సాలను సుమారు 3.5 శాతం తగ్గించింది.
హర్యానాలోని పానిపట్ జిల్లా లో బువానాలఖు గ్రామంలో 2022 నవంబర్ 2న జరిగిన సర్పంచ్ ఎ న్నికలు మొదట్లో ఒక చిన్న గ్రామీణ సం ఘటనలా కనిపించింది. కానీ, దాదాపు మూడున్నరేండ్ల నిరీక్షణ, ఒక పౌరుడి ప ట్టుదల తర్వాత సుప్రీంకోర్టు నుంచి వచ్చి న తీర్పు, ఈ సంఘటనను యావత్ భార త ప్రజాస్వామ్యంపైనే ఒక పెద్ద ప్రశ్నగా నిలబెట్టింది. ఒక వ్యక్తి తన హక్కు కోసం చేసిన పోరాటం.. కేవలం ఒక గ్రామంలోనే కాదు, దేశ ఎన్నికల ప్రక్రియలోని లోపాల ను ప్రపంచానికి చాటి చెప్పింది. ఆ ఎన్నికల్లో తొలి ఫలితాల్లో కుల్దీప్ సింగ్ 313 ఓట్ల భారీ మెజారిటీతో విజేతగా ప్రకటించబడ్డారు.
అధికారులు అధికారిక గెలుపు సర్టిఫికెట్ కూడా జారీ చేశారు. కానీ ప్రత్య ర్థి మోహిత్ కుమార్ ఈ ఫలితాలను వెంట నే సవాలు చేశారు. పోలింగ్ బూత్ నం బర్ 69లో తనకు వచ్చిన వందల ఓట్లు కుల్దీప్ ఖాతాలో చేరాయని, ఇది పేపర్‌వర్క్‌లో కావాలనే చేసిన లోపమని ఆరోపిం చారు. ఈ కేసు స్థానిక పానిపట్ ట్రిబ్యునల్‌లో మొదలైంది. అక్కడ తీర్పు వ్యతిరే కంగా రావడంతో, ఆయన హర్యానా హై కోర్టును ఆశ్రయించారు.
అక్కడా నిరాశే ఎదురవడంతో, చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2025 జూలై 31న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సదరు పోలింగ్ బూత్‌లోని అన్ని ఈవీఎంలను తిరిగి లె క్కించారు. రీకౌంటింగ్ ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈవీఎంల లెక్కింపులో మోహిత్ కుమార్‌కు 1,051 ఓట్లు, కుల్దీప్ సింగ్‌కు 1,000 ఓట్లు వచ్చాయని తేలింది. అనూహ్యంగా 51 ఓట్ల స్వల్ప తేడాతో మో హిత్ కుమార్ నిజమైన విజేతగా బయటపడ్డారు. ఈ ఉదంతం భారత ప్రజాస్వా మ్యం ఆత్మను నిలబెట్టిన న్యాయవ్యవస్థ విజయమా? లేక ఎన్నికల సంఘం లోపాలను బహిర్గతం చేసిన చేదు నిజమా? అన్నది చర్చగా మారింది.
ఈవీఎంలతో పెరిగిన మోసాలు..
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడం ఈసీ బాధ్యత. మన దేశంలో 2004 నుంచి దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వినియోగం మొదలైంది. దీనికి ప్రధాన కారణం అంతకుముందు బ్యాలెట్ పేపర్ల కాలంలో జరిగిన భారీ మోసాలు. బూత్ క్యాప్చరింగ్, బలవంతపు ఓటింగ్, ఒకే వ్యక్తి బండిల్‌గా ఓట్లు వేయడం వంటి అక్రమాలు చాలా ఎక్కువగా జరిగేవి. బ్రూ కింగ్స్ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనం ప్రకారం.. ఈవీఎంల ప్రవేశం దేశంలో ఎన్నికల మో సాలను సుమారు 3.5 శాతం తగ్గించింది.
ఈవీఎంల వాడకం ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు వ్యయాన్ని భారీగా తగ్గించింది. అయితే ఈవీఎంలతో మోసాలు పెరిగాయి. పనితీరు, నిల్వ సమయంలో భద్రత, ఓట్ల లెక్కింపులో పారద ర్శకత వంటి విమర్శలు ఎక్కువైపోయా యి. హర్యానాలో జరిగిన ఉదంతం ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చి, ఎన్నికల సంఘంపైై ప్రజల విశ్వాసాన్ని ప్ర శ్నార్థకం చేసింది. హర్యానా ఉదంతం ఒక్కటే కాదు, గత కొన్నేండ్లుగా దేశంలో ఈవీఎంల పనితీరుపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి.
మహారాష్ర్టలో 2019లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెస్, ఎన్‌సీపీ నేతలు ‘ఈవీఎంలలో లోపాలు ఉన్నాయేమో’ అంటూ పి టిషన్లు వేశారు. కానీ ఈసీ తమ అంతర్గత తనిఖీలలో ఎటువంటి లోపాలు లేవని తేల్చి చెప్పింది. 2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత లక్ష్మ ణ్.. బీజేపీ ఈవీఎంలను టాంపరిగ్ చేసిందని ఆరోపించారు. ఈ ఆరోపణలకు బల మైన ఆధారాలు లేకపోవడంతో ఈసీ వాటిని ఖండించింది. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్ విజయం ప్రతిపక్షాలకు ఈవీఎంలపై అనుమానాలను పెంచింది. దీనిపై కూడా పూర్తి స్థాయి విచారణ జరగలేదు.
నమ్మకానికి అద్దం వీవీప్యాట్లు
ఈవీఎంలపై పెరుగుతున్న అనుమానాలను పారదోలడానికి, ఎన్నికల సంఘం 2014 నుంచి వీవీప్యాట్ల పద్ధతిని అమలు చేయడం ప్రారంభించింది. ఈ పద్ధతిలో ఓటరు బటన్ నొక్కిన వెంటనే ఒక కాగితం స్లిప్‌లో తాను ఎవరికి ఓటు వేశాడో ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది. ఈ స్లిప్పులను ఎన్నికల వివాదాల సందర్భంలో తిరిగి లెక్కించడానికి వీలుంటుంది. 2019 సాధారణ ఎన్నికల నాటికి, దేశవ్యాప్తంగా అన్ని పోలింగ్ బూత్‌ల్లో వీవీప్యాట్ యంత్రాలను ఉపయోగించారు. కానీ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో రాండమ్‌గా కేవలం ఐదు బూత్‌ల స్లిప్పులను మాత్రమే లెక్కిస్తారు. ఇది ప్రజలకు, రాజకీయ పార్టీలకు తగినంత భరోసా కలిగించలేదని, విస్తృతంగా రీకౌంటింగ్ జర గాలని డిమాండ్లు పెరిగాయి.
ఈ పరిమిత లెక్కింపు విధానం ఈవీఎంలలోని లోపాలను పూర్తిగా బయటపెట్టలేదని పలువురు వాదిస్తున్నారు. భారత్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఐదేండ్లకోసారి సుమారు 95 కోట్ల మంది ఓటర్లు తమ నాయకులను ఎన్నుకుంటారు. ఇంత పెద్ద స్థాయిలో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం ఒక మహత్తర కార్యం. ఈవీఎంలలో సాంకేతిక లోపాలు, మానవ తప్పిదాలు, అక్రమాలు జరిగే అవకాశం ఉన్నంత కాలం ఈ చర్చ కొనసాగుతూనే ఉంటుంది. ఈవీఎంలపై న మ్మకాన్ని పునరుద్ధరించడానికి, ఎన్నికల వ్యవస్థలో కొన్ని కీలక సంస్కరణలు అవసరం.
వీవీప్యాట్ స్లిప్పుల విస్తృత లెక్కింపు, రిస్క్ లిమిటింగ్ ఆడిట్స్ (ఆర్‌ఎల్‌ఏ), సీసీటీవీ, డిజిటల్ ట్రాకింగ్ ,సాంకేతిక పారద ర్శకత, బ్యాలెట్ పేపర్లకు తిరిగి వెళ్లడం లాంటి వాటి గురించి ఆలోచించాలి.‘ప్రజాస్వామ్యం కేవలం ఓటు వేసే హక్కు కాదు. ఆ ఓటు సరిగా లెక్కించబడుతుందన్న నమ్మకం’. ఈ సవాలును అధిగమించాలంటే, ఎన్నికల వ్యవస్థలో పూర్తి పారద ర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావాలి. అప్పుడే ఓటరుకు తన ఓటు శక్తిపై, ఎన్నికల ఫలితాలపై పూర్తి విశ్వాసం ఏర్పడుతుంది.
వ్యాసకర్త సెల్: 9912178129