26-08-2025 12:00:00 AM
డాక్టర్ వీరస్వామి :
తరతరాలుగా భారతీయ సమాజం లో నరనరానా జీర్ణించుకు పో యిన భావాలతో ఉత్పత్తిలో భాగమవు తూ, అగ్రకులాలకు సేవ చేస్తూ, అంకిత భావంతో ఉంటూ, ఇతరుల జోలికి వెళ్లకుండా, ఏమీ ఉన్నా, లేకున్నా ఆత్మగౌరవంతో బతుకుతూ, ఎలాగోలాగా జీవితం కొనసాగించాలనుకునే ప్రజలే వెనుకబడిన కులాల వర్ణ వ్యవస్థలో చివరి వర్ణమైన శూద్రుల్లో భాగమైన వెనుకబడిన కులాల ప్రజలు అతిశూద్రులకన్నా కొంచెం పైస్థాయిలో ఉండటం వల్ల, పై మూడు వర్ణాల తోటి అంటకాగడానికి అవకాశం కల్పించబడింది.
దాంతో అదే మహా భాగ్యం అనుకోని, మురిసిపోయి, బుద్దిగా, ఉన్నదానితో తృప్తిగా, బతుకులీడుస్తూన్న జనమే వెనుకబడిన కులాల జనం. మూడ వ వర్ణమైన వైశ్యుల నుంచి కాలక్రమంలో తక్కువ ఆదాయం ఎక్కువ శ్రమ చేయాల్సి రావడంతో నిరాకరింపబడిన వ్యవసాయాన్ని అందిపుచ్చుకున్న కొన్ని శూద్ర కులాల వారు ఆయా ప్రాంతాల్లోనీ పరిస్థితులను బట్టి, సమయానుకూలంగా పై వర్ణాలకు దగ్గరై, పాలనలో భాగస్వాములై, పటేల్-పట్వారీ వ్యవస్థ ద్వారా జాగీర్దారులు, జమీందారులుగా వెలుగొందిన వారు తెలివిగా భూమిని తమ పేరు మీద రాసుకొని, భూస్వాములుగా మారినారు.
దానికి తోడు బ్రిటిష్ వారు ప్రవేశ పెట్టిన ఆధునిక విద్య ను అంది పుచ్చుకొని, భూముల నుంచి వచ్చిన ఆదాయాన్ని రకరకాల పరిశ్రమల్లో పెట్టుబడిగా పెట్టి ఆర్ధికంగా బలపడినారు. ఆ తర్వాత పరిశ్రమాధిపతులై, పెట్టుబడి దారులుగా ఎదిగి విదేశాలతో సంబంధాలను ఏర్పరచుకొని అధికారాన్ని ఉపయోగించుకొని పాలనా పగ్గాలు చేజిక్కించుకున్నారు. సంప్రదాయంగా వస్తున్న వార సత్వ విధానములో అధికారాన్ని అంటిపెట్టుకొని, దానిని ఆసరా చేసుకొని శూద్రు లలోని అగ్రకులాల వారు చిరకాలంగా అధికార ఫలాలను పొందుతున్నారు.
అధికార ఆలోచన లేకుండా..
రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల వల్ల ఎస్సీ, ఎస్టీలు.. విద్య , ఉద్యోగాలతో పాటు చట్ట సభల్లో అధికారాన్ని పొంది అందలాన్ని అందిపుచ్చుకున్నారు. బీసీలకు రాజ్యాంగం ప్రకారం ప్రత్యేక సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల ఎలాంటి ఆదరణకు నోచుకోలేదు. వారిని కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే ఉపయోగించుకున్నారు. మరోవైపు బీసీల్లో చైతన్యం రాకుండా విద్య ద్వారా పకడ్బందీగా స్వా తంత్య్రానంతరం వర్ణ వ్యవస్థకనుగుణంగా పునర్నిర్మించి ప్రజలను ఇంకా ఎన్నేళ్లయినా మార్పు సరికదా ఆలోచనే రాకుం డా చేయగలిగారు.
అధికారం గురించి బీసీలను ఆలోచించకుండా చేయడంలో విజయవంతమయ్యారు రాజ్యాంగం ద్వా రా ద్రోహానికి గురైన వారు బీసీలు మా త్రమే. బీసీలంతా సమాజంలోని కట్టుబాట్లను పద్ధతిగా పాటిస్తూ ఏ మాత్రం చల నం లేకుండా, మేమింతే! మా బతుకులు ఇంతే! అని లోలోన బాధపడుతూ, పైకి మాత్రం గంభీరంగా ఫోజు పెడుతూ, ఆ బాధను పైకి కనపడనీయకుండా నటించడం బాధాకరం.
అటు మితవాదులు.. ఇటు అతివాదులు మొసలి కన్నీళ్ళు కారుస్తూ ఈ విషయాన్ని చర్చించకుండా వర్గం, వర్గపోరాటం అంటూ దాటవేస్తున్నారు. రాజ్యాంగాన్ని రాసిన వారు ఏ ఉద్దేశంతో రాశారో కాని బ్యాక్ వర్డ్ క్లాస్ అనే పదం ఒక గుదిబండగా మారి ఎనిమిది దశాబ్దాలుగా బీసీలు ద్రోహానికి గురవుతున్నారు. ఎవరు ఏం చెబితే అది నమ్మి వాళ్లకు ఓట్ల ను నమ్మకంగా వేసి గెలిపించిన విశ్వాస పాత్రులు బీసీ ప్రజలు.
బీసీలపై నిర్లక్ష్య వైఖరి
బీసీల కోసం ఒక కమిషన్ వేసి వారి వెనుకబాటుతనాన్ని గుర్తించి, వారి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నా.. గతంలో కాంగ్రెస్ కానీ ప్రస్తుత ఎన్డీయేలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న బీజేపీ పార్టీ కానీ రాజ్యాంగ రక్షకులుగా ఇప్పటి వరకు ఏం చేయలేదనేది అక్షర సత్యం. అధికారంలో ఉన్న పార్టీలు కుల గణన చేసి బీసీలు ఎందరున్నారో చెప్పాలి. మరోవైపు ప్రతిపక్ష పార్టీ మేం అధికారంలో కోస్తే న్యాయం చేస్తామని పేర్కొంటుంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు గతం లో అధికారం అనుభవించిన సమయం లో బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయం మరచిపోయారా?. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట అన్ని రకాల అవకాశాలను అగ్ర కులాలకే కల్పిస్తున్నారు.
అందుకు మన రాష్ర్టమే నిదర్శనం. ఇంకా చెప్పాలంటే దేశంలో ఒక ముఖ్యమైన పదవి కోసం ఇండియా కూటమి తరపున ఆ పార్టీ ఇటీవల ఉపరాష్ర్టపతి అభ్యర్థి ఎం పిక ఒక ప్రభల సాక్ష్యంగా పేర్కొనవచ్చు. మన రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉండి మంత్రివర్గంలో, కార్పొరేషన్ పదవుల్లో ఎందుకు బీసీలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం పదవులు ఇవ్వడం లేదు? కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విష యం ఏమిటంటే బీసీల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని రాజ్యాంగం లో పేర్కొన్నా, ఎనిమిది దశాబ్దాలు కావస్తున్నా, ఇప్పటివరకు పాలకులు ఎందుకు చేయలేకపోయారు? ఈ అంశం దశాబ్దమున్నర కాలం అధికారంలో ఉన్న బీజేపీకి కూడా వర్తిస్తుంది. బీసీలందరూ మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది .
బీసీలు చాలా కోల్పాయారు
స్వాతంత్య్రానంతరం పాలకులు కులం లేదని.. అందరూ సమానమేనని ఆర్టికల్ 14లో కల్లబొల్లి కబుర్లు చెబితే వాళ్ల జెం డాలు మోసి, ఓట్లు వేసి, గెలిపించి నెత్తిన పెట్టుకున్న మహా విధేయులు బీసీ వర్గాల వారు. ఆర్థిక అసమానతలకు మూలం మ న కర్మ అని నమ్మి, అన్ని రకాల దేవుళ్లను, దేవతలను కొలిచి, నైవేద్యాలు పెట్టి, సర్వం సమర్పించే లక్షణం ఉన్నవారు బీసీలు. తమ స్వంత ప్రజల గురించి చర్చించకుం డా ఇతరుల గురించి మాట్లాడే స్వభావమున్న బీసీలు సర్వం కోల్పోయారు. బీసీ లంతా తమకు తెలిసిన, వీలైన పద్ధతుల్లో ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది.
ఒకవేళ కొద్దో గొప్ప చైతన్యం వచ్చినా, అది రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోకుండా పోవడానికి గల కారణాలు వెతుక్కోవాల్సిన అవసరం ఉం ది. వెనుకబడిన కులాలు అంటే ‘కప్పల తక్కడ’ అని, ‘అనైక్యతకు చిరునామా’ అని అంటున్న దానిలో వాస్తవమేంతో శోధించాలి. ఎక్కువ సంఖ్యలో ఉన్న బీసీ ప్రజల కు ఇంతకాలం అధికారం అనేది మనకు సంబంధించినది కాదు అనే అభిప్రాయం ఉంది. కాబట్టి దానిని పోగొట్టడం కోసం వివిధ మార్గాల్లో ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరముంది. బీసీలు అధికారంలోకి వస్తే, దాని ఫలాలు ఎలా అందుతాయో, మార్పు ఎలా ఉంటుందో వివరించాలి.
అది అనేక రూపాల్లో జరగాలి. అధికార మార్పిడికి అగ్ర కులాలు అసలు ఒప్పుకోవు. అదీగాక అధికారం దూరమౌతుం దంటే ఎంతకైనా తెగిస్తారు. కాబట్టి బీసీల్లో చైతన్యం కలిగించే వారిని ఒకవైపు కాపాడుకుంటూనే మరోవైపు అగ్ర కులాల ఎత్తుల కు పై ఎత్తులు వేసి గెలవాల్సిన అవసరం ఉంది. లేకుంటే తర్వాత తరం అన్ని విధాలుగా నష్టపోతారు. కాబట్టి ఎంతో బాధ్య తాయుతంగా బీసీ నాయకులు పని చే యాల్సిన అవసరం ఉంది. దేశంలో మెజారిటీ సంఖ్య కలిగిన వెనుకబడిన వర్గం వా రు ఏకమైతే, అధికారం వస్తుందనే సోయి అంటే స్పృహ కల్పించాల్సిన అవసరం ఉంది.
అందుకు మార్గాలను వెతికి, వాటి ని గుర్తించి అమలు పరచాలి. అది ఏ ఒక్క రో ఇద్దరో కాకుండా అన్ని ప్రధానమైన కులాల వారు ఐకమత్యంగా సమాన ప్రా తినిధ్యంతో బాగా వెనుకబడిన కులాల వారికి తగినంత ప్రాధాన్యత కల్పించి సముచితంగా గౌరవించి, వారిలో ఉన్న అపోహలను తొలగించి, అందరికీ ఆమోద యోగ్యమైన ఒక ముసాయిదాను రూపొందించుకొని జాగ్రత్తగా ఉద్యమాన్ని ముం దుకు తీసుకెళ్లాలి. ఈ ఉద్యమం ఏదో ఒక టి, రెండు సమస్యల గురించి కాకుండా రా జ్యాధికారం సాధించే దిశగా సాగాల్సిన అవసరముంది.
రచయిత: బీసీ మేధావుల వేదిక
కోర్ కమిటీ సభ్యుడు