22-06-2024 12:00:00 AM
‘ఈవీఎం’లను హ్యాక్ చేయడం ఎవరి తరమూ కాదు. ‘అది అసాధ్యం’ అని ఐ.ఐ.టి డైరెక్టర్ రజత్ స్పష్టం చేశారు కూడా. ప్రతిపక్షాలు ఓటమిని హుందాగా ఒప్పుకుంటే బాగుంటుంది. అలా కాక, హ్యాక్ జరిగిందనడం అజ్ఞానమే. నాయకులు తమ తప్పులు తెలుసుకోక ఓటమి చవిచూసేసరికి ఈవీఎంలు గుర్తుకు వస్తాయి. ‘హ్యాక్ జరిగిందని’ గగ్గోలు పెడతారు. మెజారిటీ వస్తే ఒక విధంగా మాట్లాడటం, రాకపోతే మరోలా మాట్లాడటం వారికి తగదు. అన్ని రకాల పరీక్షలు చేశాకే ఈవీఎంలను ఉపయోగిస్తారు. ఎవరైతే హ్యాక్ అంటున్నారో వారే ప్రత్యక్షంగా హ్యాక్ ఎలా చేస్తారో చేసి చూపితే బాగుంటుంది. అనవసర విమర్శలు వదిలేసి ఓటమి పాలైన వారు కొత్త ప్రభుత్వాలకు మనస్ఫూర్తిగా సహకరించడం మంచిది.
కనుమ ఎల్లారెడ్డి, తాడిపత్రి