23-12-2025 12:00:00 AM
హైదరాబాద్ ,సిటీ బ్యూరో డిసెంబర్ 22 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన లభించింది. నగరవ్యాప్తంగా పౌర సమస్యలపై మొత్తం 187 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. ఇందులో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నేరుగా 62 అర్జీలు రాగా, మిగిలిన ఆరు జోన్ల పరిధిలో కలిపి 125 ఫిర్యాదులు నమోద య్యాయి.
జోన్ల వారీగా వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తే.. కూకట్పల్లి జోన్ నుంచి అత్యధికం గా 52 అర్జీలు వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో సికింద్రాబాద్ జోన్ (26), శేరిలింగంపల్లి (19), ఎల్బీనగర్ (17) ఉన్నాయి. ఇక ఖైరతాబాద్ జోన్ లో 6, చార్మినార్ జోన్ లో అత్యల్పంగా 5 ఫిర్యాదులు మాత్రమే నమోదయ్యాయి. ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు రఘు ప్రసాద్, సుభద్రాదేవి, అలివేలు మంగతాయారు, సత్యనారాయణ, వేణుగోపాల్ పాల్గొన్నారు.