calender_icon.png 23 December, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లైంగిక దాడి కేసులో జీవిత ఖైదు

23-12-2025 12:00:00 AM

ఎల్బీనగర్, డిసెంబర్ 22 : మైనర్‌పై లైంగిక దాడి కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ ఎల్బీనగర్ జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే...  నాగోల్ -బండ్లగూడలోని వడ్డెర బస్తీకి చెందిన దండుల సాయికుమార్ సెంట్రింగ్ పని చేస్తున్నాడు. అయితే, నాగోల్‌లోని జైపూరికాలనీలో నవంబర్ 16, 2023 సాయంత్రం 4 గంటల సమయంలో బాధితురాలు (మైనర్) ఒంటరిగా ఉండడానికి గమ నించిన సాయికుమార్ ఇంట్లోకి వెళ్లి.. బాధితురాలిని బలవంతంగా బాత్‌రూమ్‌లోకి తీసు కొని వెళ్లి, లైంగిక దాడికి పాల్పడ్డాడు.

జరిగిన దారుణంపై బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి నవంబర్ 20-, 2023న నాగోల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమో దు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి, నిందితుడిని రిమాండ్ తరలించారు. కేసును ఎల్బీన గర్ జిల్లా కోర్టులోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారించింది.  కేసులో తుది తీర్పును సోమవారం న్యాయమూర్తి నిందితుడికి జీవితఖైదు విధి స్తూ తీర్పు ఇచ్చారు. కేసులో  పీపీలు  సత్యనారాయణ, శోభారాణి వాదనలు వినిపించారు.