02-12-2025 01:38:43 AM
సామాజిక సేవపై వక్తల ప్రశంసలు
హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): గంట రవికుమార్ ఫౌండేషన్ పేరుతో గంట రవికుమార్ అందిస్తున్న సేవలు ఆదర్శనీయమని వక్తలు పేర్కొన్నారు. సోమవారం జీఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో 8, 9, 10 తరగతుల పేద, ఉత్తమ విద్యార్థులకు ఉచిత ట్యూషన్ తరగతులను శివనగర్‌లోని గోల్డెన్ ఓక్స్ స్కూల్ లో ప్రముఖ ఫిజీషియన్ డా. పొన్నా దశరథం, సీనియర్ జర్నలిస్టు బుదారపు శ్రీనివాస్, ప్రముఖ న్యాయవాది నాయిని అనిల్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరం గల్లోని 14 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 528 మంది నిరుపేద విద్యార్థుల టెన్త్ పరీక్ష ఫీజును చెల్లించారని చెప్పారు. అతితక్కువ ఫీజులతోనే సత్యం కంప్యూటర్లో పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్యను, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి కల్పన అందిస్తున్నారని, రక్తదాన శిబిరాలు నిర్వహించి ఎంతో మందికి ప్రాణదాతగా రవికుమార్ నిలిచారన్నారు.
ప్రజా సేవలోనే తనకు ఎంతో ఆనందం ఉంద ని సత్యం కంప్యూటర్స్ సంస్థల అధినేత, జీఆర్కే ఫౌండేషన్ చైర్మన్, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పేర్కొన్నారు. తాను రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉన్నా సామాజిక సేవ చేయడమంటేనే ఎంతో ఇష్టమన్నారు.
కార్యక్రమంలో శివనగర్ ప్రముఖులు మాజీ కౌన్సిలర్ కోటమ్మ, గజ్జెల లింగమూర్తి, గిరిప్రసాద్, రాంమూర్తి, వైట్ల గణేష్, గంట రవికుమార్ ఫౌండేషన్ సభ్యులు మహమ్మద్ రఫీ, కందుకూరి విజయ్ కుమార్, సామల శ్రీనివాస్ వేణు, సునీల్, సతీష్, రంజిత్, కిషోర్, సురేష్, రాజ్ కుమార్ పాల్గొన్నారు.