calender_icon.png 27 January, 2026 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుల మతాలకు అతీతంగా ఉర్సు

27-01-2026 12:21:21 AM

కొండాపూర్, జనవరి 26: ఉర్స్ షరీఫ్ ఉ త్సవాలు కులమతాలకు, సాంప్రదాయాలకు అతీతంగా నిలుస్తాయని బిఆర్‌ఎస్ రాష్ట్ర నా యకుడు చింత సాయినాథ్ అన్నారు. సోమవారం కొండాపూర్ మండలంలోని అలి యాబాద్ ఉర్స్ షరీఫ్ ఉత్సవాల సందర్భం గా చింతా సాయినాథ్ దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి ఖవాలి విని ఆనందాన్ని వ్య క్తం చేశారు. అలియాబాద్ లో ఊర్స్ షరీఫ్ ఉత్సవాల నిర్వాహకుడు సయ్యద్ ఫహీం ఉ ర్స్ ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహిస్తూ మ త సాంప్రదాయాలకు అతీతంగా జరపడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు విఠల్, సర్పంచ్ రత్నయ్య, బిఆర్‌ఎస్ నాయకులు గోవర్ధన్ రెడ్డి,మల్లా గౌడ్, ప్రేమనందం, పెంటయ్య, పోచయ్య, రిటైర్డ్ ఎస్ ఐ లు ఎల్లయ్య, విట్టల్ తదితరులు పాల్గొన్నారు.