calender_icon.png 21 December, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్వాసమే పునాదిగా..

21-12-2025 12:00:00 AM

  1. ఉపాధ్యాయుడి సంకల్పం నుంచి పుట్టిన ‘సీఆర్‌కే గ్రూప్’

చిట్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, అసెట్ మేనేజ్‌మెంట్ రంగాల్లో అప్రతిహత విజయం

విలువల్లో రాజీపడని ఫౌండర్ చిలప్పగారి రాధాకిషన్

వారసత్వాన్ని అందిపుచ్చుకున్న అనురాగ్, ఆదర్శ్

కస్టమర్లే బ్రాండ్ అంబాసిడర్లుగా మూడు దశాబ్దాల పండగ

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 20 (విజయక్రాంతి): వ్యాపారంలో రాణించడం ఒక ఎత్తుతై, మూడు దశాబ్దాల పాటు వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మరొక ఎత్తు. సరిగ్గా 30 ఏళ్ల క్రితం, 1994లో బీజం పడిన సీఆర్‌కే గ్రూప్ నేడు ఒక మహావృక్షంగా ఎదిగింది. చిట్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, అసెట్ మేనేజ్‌మెంట్ రంగా ల్లో తనదైన ముద్ర వేస్తూ, వినియోగదారులకు ఆర్థిక భద్రతను కల్పిస్తూ విజయవం తంగా 30 వసంతాలు పూర్తి చేసుకుంది. 

అప్రతిహత ప్రస్థానం

30 ఏళ్ల క్రితం ఒక స్పష్టమైన విజన్‌తో ప్రారంభమైన సీఆర్‌కే గ్రూప్.. నేడు ఒక బలమైన శక్తిగా ఎదిగింది. ఈ ప్రయాణం గురించి సంస్థ ముఖ్యులు చిలప్పగారి రాధాకిషన్ మాట్లాడుతూ.. ‘ఇది కేవలం వ్యాపా ర ప్రయాణం కాదు. విలువల ప్రయాణం. చిత్తశుద్ధి, విలువలను సృష్టించడం మా ప్రధాన లక్ష్యాలుగా పనిచేశాం. అందుకే కస్టమర్లు మాపై చెక్కుచెదరని విశ్వాసాన్ని ఉంచారు. అదే మాకు నిజమైన ఆస్తి’ అని పేర్కొన్నారు.

మార్గదర్శకుల స్ఫూర్తితో

సంస్థ విజయ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించిన చిలప్పగారి రాధాకిషన్ కృషిని రాజం విజయలక్ష్మి ఈ సందర్భంగా కొనియాడారు. కస్టమర్లే దేవుళ్లుగా భావించి, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడకుం డా వారు వేసిన బాటలో సంస్థ నడుస్తోందని తెలిపారు. వ్యాపార నైతికతను పాటి స్తూనే అభివృద్ధి సాధించవచ్చని సిఆర్‌కే గ్రూప్ నిరూపించిందని పేర్కొన్నారు.

మా లక్ష్యం.. మీ ఆర్థిక భద్రత

కేవలం లాభార్జనే కాకుండా.. పారదర్శకత చిత్తశుద్ధితో వినియోగదారుల జీవితాల్లో వెలుగులు నింపడమే తమ లక్ష్యమని సీఆర్‌కే గ్రూప్ పునరుద్ఘాటించింది. భవిష్యత్తు లోనూ అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని, మరిన్ని సేవలను అందుబాటులోకి తెస్తామని డైరెక్టర్లు అనురాగ్, ఆదర్శ్ తెలిపారు. 

ఉపాధ్యాయ వృత్తి నుంచి వ్యాపార శిఖరాలకు

సీఆర్‌కే గ్రూప్ ఫౌండర్, చైర్మన్ చిలప్పగారి రాధాకృష్ణన్ ప్రయాణం ఎందరో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆదర్శం. ఉస్మానియా యూనివ ర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలో ఎంఏ, ఎంఫిల్ చేసి గోల్డ్ మెడల్ సాధించిన ఆయన.. తొలినాళ్లలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తన తోటి ఉపాధ్యాయులు, మిత్రుల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు చిన్న మొ త్తంలో ఫైనాన్స్, చిట్‌ఫండ్స్ ప్రారంభించారు. ఆనాడు ఆయన చూపిన నిజాయతీ, సమయపాలన, నిబద్ధత నేడు సీఆర్‌కే గ్రూప్‌ను ఈ స్థాయికి చేర్చాయి. గత 25 ఏళ్లుగా గ్రూప్ వ్యూహాత్మక విదానాలను రచిస్తూ, సంస్థను ముందుకు నడిపిస్తున్నారు.

యువతరం జోష్.. నయా ఆలోచనలు

సీ అనురాగ్ డైరెక్టర్.. అమెరికాలో కన్‌స్ట్రక్షన్ అండ్ మేనేజ్‌మెం ట్‌లో మాస్టర్స్ పూర్తి చేసి 2018 లో గ్రూప్‌లో చేరారు. తనకున్న అంతర్జాతీయ అనుభవం తో, సరికొత్త ఐడియాలతో సంస్థ కార్యక లాపాలను విస్తరించ డంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సి.ఆదర్శ్ డైరెక్టర్.. సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ఆదర్శ్, సాం ప్రదాయ చిట్‌ఫండ్ వ్యా పారాన్ని ఆధునిక టెక్నాలజీతో అనుసంధానిస్తున్నారు. సంస్థను ప్రముఖ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీగా మార్చడంలోనూ, వినియోగదారుల పరిధిని పెంచడం లోనూ కృషి చేస్తున్నారు.