calender_icon.png 2 October, 2025 | 10:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ గోల్డ్‌లోన్ ఫిషింగ్ స్కామ్ ముఠా అరెస్ట్

02-10-2025 12:56:52 AM

దేవరకొండ అడిషనల్ ఎస్పీ మౌనిక

దేవరకొండ, అక్టోబర్ 1: నల్గొండ జిల్లా, డిండి పోలీస్ స్టేషన్ పరిధిలో ’బ్యాంకులో ఉన్న బంగారాన్ని విడిపించి అధిక కమిషన్ ఇస్తామని నమ్మించి అమాయక ప్రజలను మోసం చేసిన ఇద్దరు నిందితులను డిండి పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితుల వద్ద నుంచి రూ. 4,52,000/- నగదు, నకిలీ రసీదులు, రెండు స్కూటర్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు డిండి, మచిలీపట్నం, సాయిరాం నగర్ వంటి ప్రాంతాలలో ఇలాంటి మోసాలకు పాల్పడి, మొత్తం రూ. 16,67,350/- దుర్వినియోగం చేసినట్లు తేలింది.

బ్యాంకులో తాకట్టు పెట్టిన మీ బంగారాన్ని విడిపించి, అధిక కమిషన్ ఇస్తాం’ అని చెప్పే వ్యక్తులను లేదా ప్రచారాలను అస్సలు నమ్మవద్దు అని దేవరకొండ అడిషనల్ ఎస్పీ మౌనిక తెలిపారు. ఈ మోసపూరిత వలల్లో చిక్కుకోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.