calender_icon.png 2 October, 2025 | 12:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొంగతనానికి పాల్పడింది పనిమనిషి

02-10-2025 12:59:09 AM

  1. 43.6 తులాల బంగారం, రూ.1.75 లక్షల నగదు స్వాధీనం

వివరాలు వెల్లడించిన ఎస్పీ నరసింహ

సూర్యాపేట అక్టోబర్ 1 (విజయక్రాంతి) : సూర్యాపేట పట్టణం కృష్ణానగర్ కాలనీలో ఒక వృద్ధురాలు ఇంట్లో జరిగిన దొంగతనం కేసును సూర్యాపేట పట్టణ పోలీసులు, సి సి ఎస్ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. ఈ కేసు సంబంధించిన వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నర్సింహా బుధవారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరణ ప్రకారం.. కృష్ణానగర్ కాలనీలో ఓ వృద్ధురాలు ఒంటరిగా ఉంటున్నదన్నారు.

ఈమె కుమారులు ముగ్గురు హైద్రాబాద్ లో ఉంటున్నారు. ఈ వృద్ధురాలికి సేవలు చేయడం కోసం కుమారులు పనిమనిషిని ఏర్పాటు చేశారు. అయితే ఆమె నమ్మకంగా పనిచేస్తూ వృద్ధురాలి వద్ద తాళం చేతులు గమనించి ఆమె ఇంట్లో బీరువాలో ఉన్న 40 తులాల బంగారు బిస్కెట్లు, మూడున్నర తులాల బంగారు చంద్రహారం, నగదును అపహరించిందన్నారు.

తదుపరి వృద్ధురాలి కుమారులు ఇంట్లో బంగారం కనిపించక పోవడంతో సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ లో గత నెల 29న రోజున ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై దొంగతనం కేసు నమో దు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా వృద్ధురాలి ఇంటి వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలం నాయకునిగూడెం గ్రామంకు చెందిన పని మనిషి కరీమా బేగం  ప్రస్తుతం కృష్ణానగర్ కాలనీ, సూర్యాపేట పట్టణంలో నివాసం ఉంటుంది.

ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పకు న్నదన్నారు. ఆమె వద్ద నుండి 40 తులాల నాలుగు బంగారు బిస్కెట్లు, మూడున్నర తులాల చంద్రహరం తాడు, రూ.1.75 లక్షల నగదును సీజ్ చేసి ఈరోజు కోర్టుకు హాజరు పరచడం జరుగుతుంద న్నారు.

బంగారం విలువ 53 లక్షలు నగదు కలుపుకొని మొత్తం 55 లక్షల సొత్తును సూర్యాపేట పట్టణ పోలీసులు రికవరీ చేసి కోర్టుకు రిమాండ్ చేశామన్నారు. ఈ కేసులో బాగా పనిచేసిన సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్త్స్ర శివతేజ, ఎస్‌ఐ సురేష్, సూర్యాపేట పట్టణ పోలీసు, సిసిఎస్ సిబ్బందిని అభినందించి రివారడ్స్ అందించారు.