01-12-2024 03:57:49 AM
21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణప్రదీప్
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 30 (విజయక్రాంతి): మెరిట్ సాధించడానికి హద్దులుండవని 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణప్రదీప్ అన్నారు. ఇబ్రహీంపట్నంలోని విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 21 ఐఏఎస్ అకాడమీ సహకారంతో వింగ్స్ మీడియా, జీ5 మీడియా గ్రూప్‌తో కలిసి మొదటి ప్రయత్నంలో ఐఏఎస్ సాధించడం ఎలా అనే అంశంపై సెమినార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ మాట్లాడుతూ సీఎంవోలో పదేళ్లపాటు సేవలందించిన ఏకైక మహిళా ఐఏఎస్ స్మితాసబర్వాల్ అని కొనియాడారు. 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ చీఫ్ మెంటర్ భవాని మాట్లాడుతూ యూపీఎస్సీ పరీక్షల్లో ప్రాథమిక ప్రశ్నలుంటాయని, క్లిష్టమైన ప్రశ్నలతో కూడుకున్న దనే అపోహను తొలగించుకోవాలని విద్యార్థులకు సూచించారు. కాలేజీ చైర్మన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వచ్చిన అవకాశా లను సద్వినియోగం చేసుకోవాలని
సూచించారు. ఈ అకాడమీ సహకారంతో సివిల్ ఆస్పిరెంట్స్ క్లబ్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.