24-12-2025 12:26:29 AM
హాజరైన తెలంగాణ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి
గజ్వేల్, డిసెంబర్ 23: తెలంగాణ రైతాం గం కూరగాయలు, పాలు ఉత్పత్తిలో స్వ యం సమృద్ధిని సాధించాలని, తద్వారా రా ష్ట్ర అవసరాలు తీరుస్తూనే, ఎగుమతి అవకాశాలు పెంచుకునే అవకాశాలు ఉన్నాయని తె లంగాణ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి అన్నారు. ములుగు లోని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రధాన కా ర్యాలయంలో నిర్వహించిన 11వ ఫౌండేషన్ డే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్రం లో పండ్లు, కూరగాయల సాగు విస్తీర్ణం పెం చేందుకు ప్రభుత్వం తగిన సబ్సిడీలు అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. విశ్వవిద్యాలయంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి, యువతను ఉద్యా న పంటల సాగు వైపు ఆకర్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం కొత్త విధానాన్ని రూ పొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
అలాగే రాష్ట్రంలో ద్రాక్ష సాగుకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొల్లాపూర్ మామిడి, బాలానగర్ సీతాఫలం పంటలకు విశిష్టతల దృష్ట్యా వీటిపై పరిశోధన ముమ్మరం చేసి ఎగుమతుల ద్వారా రైతులకు ఆదాయం పెంచాలని సూచించారు. మహారాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్న ఉద్యాన ప్రాముఖ్య పాలసీలను అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పంట సాగులో కీలకమైన విత్తనాలు డ్రిప్పు స్ప్రింక్లర్లు ఇతర వ్యవసాయ పరికరాలు సబ్సిడీపై అందించేందుకు ప్రభు త్వం కృషి చేస్తుందని డాక్టర్ చిన్నారెడ్డి అన్నా రు.
అనంతరం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ దండ రాజిరెడ్డి మాట్లాడుతూ రా ష్ట్రంలో కూరగాయల సాగు 12 లక్షలకు పైగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వర్సిటీ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఆధునిక కట్టింగ్ ఎడ్జ్ టె క్నాలజీలు, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ, ట ఏఐ-ఎంఎల్, రిమోట్ సెన్సింగ్ లపై త్వరలోనే నూతన పరిశోధనలను ప్రారంభిస్తామన్నా రు.
ఈ సందర్భంగా యూనివర్సిటీ అభివృద్ధికి విశేష సేవలందించిన బోధన, బోధనే తర సిబ్బందిని అవార్డులతో సత్కరించారు. కార్యక్రమంలో డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంమాజీ వైస్ ఛాన్సలర్ డా. ఎస్.డి. శికమణి హాజరై మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతలు ఉద్యాన రంగ ఉత్పాదకతను పెంచడంలో కీలకంగా మారుతున్నాయని తెలిపారు. రైతులతో నిర్వహించిన ప రస్పర చర్చలో కూరగాయలు, పండ్ల సాగు విస్తీర్ణం పెంపు, మార్కెట్ ధరలు, మధ్యవర్తు ల కమిషన్లు వంటి అంశాలపై రైతులు తమ సమస్యలను వివరించారు.
సాగుకు తగిన మద్దతు ధరలు కల్పించాల్సిన అవసరాన్ని రై తులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఎ. భగవాన్, ఉప కులపతి పివి నరసింహారావు వెటర్నరీ యూ నివర్సిటీ ప్రొఫెసర్ ఎం జ్ఞాన ప్రకాష్, కొండ లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి డాక్టర్ బి నీరజ ప్రభాకర్, డీన్ ఆఫ్ హార్టికల్చర్, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్. జె. చీనా నాయక్, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్. డి. లక్ష్మీనారాయణ, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్, డీన్ ఆఫ్ పిజి స్టడీస్ డాక్టర్ సురేష్ కు మార్, డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఇం టర్నేషనల్ ప్రోగ్రామ్స్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎన్ శ్రీనివాసన్, బోధన, బోధన సిబ్బంది, విద్యార్థులు, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.