27-05-2025 12:26:27 AM
మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల అర్బన్, మే 26 (విజయక్రాంతి): అకాల వర్షంతో తడిసిన ధాన్యానికి ఏలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేస్తామని రైతులు అధైర్య పడవద్దు అండగా ఉంటామని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.
సోమవారం రాయికల్ మండలంలోని బోర్నపల్లి గ్రామంలో అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని రైతులతో కలిసి పరిశీలించారు.రైతులు ధాన్యం ఆరబెట్టగా తూకం వేయడానికి సిద్ధంగా ఉందని మళ్లీ వర్షం వచ్చే అవకాశం ఉండడంతో తూకం వేసి లారీలు తెప్పించి ధాన్యాన్ని మిల్లర్లకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
తమ రైతుల సమస్యను తెలుసుకొని అండగా ఉన్న జీవన్ రెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.గతంలో కంటే ఈసారి వరి పంట దిగుబడి అధికంగా వచ్చిందని, అందుకఅనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సన్న వరి సాగుకు ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ అందించి ప్రోత్సహిస్తుందని తెలిపారు.
కొనుగోలు కేంద్రాల వద్ద గాని రైస్ మిలర్ల దగ్గర కానీ ఎక్కడ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే సమస్యను పరిష్కరిస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. కొనుగోలు కేంద్రాలలో దాన్యం తూకం వేసే వరకు వేచి ఉండి తూకాన్ని ప్రారంభించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి, కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్ గౌడ్, కాంగ్రెస్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కొడిపెళ్లి ఆంజనేయులు, యూత్ మండల అధ్యక్షులు ఏలేటి జలంధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ అత్తినేని గంగారెడ్డి, మాజీ ఎంపీటీసీ తలారి నాగమణి రాజేష్, నాయకులు కొయ్యేడి మహిపాల్ రెడ్డి, ఉప్పు లక్ష్మణ్, సత్యం, జలపతి రెడ్డి, మధు, పాదం రాజు, జలందర్, మహేష్, రైతులు తదితరులుపాల్గొన్నారు.