calender_icon.png 24 September, 2025 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి శ్రీధర్‌బాబును కలిసిన రైతులు

24-09-2025 12:57:01 AM

ఘట్ కేసర్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి) : రుణమాఫీ కానీ ఉమ్మడి ఘట్ కేసర్ మండల రిలే నిరాహార దీక్షలు చేపట్టిన బాధిత రైతులు మంగళవారం మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా ఇంచార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. రుణమాఫీ కానీ రైతుల సమస్యలను మంత్రి శ్రీధర్ బాబు కి వివరించారు. 

 ఈ విషయమై మంత్రి వెంటనే స్పందించి ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకువెల్లి పరిష్కరించుటకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ఘట్ కేసర్ రైతు సొసైటీ చైర్మన్ సింగిరెడ్డి రామిరెడ్డి, వైస్ చైర్మన్ బద్దం అనంతరెడ్డి, డైరెక్టర్లు రేసు లక్ష్మారెడ్డి, గోపు బాలరాజ్ యాదవ్, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్ సింగిరెడ్డి సాయిరెడ్డి, నాయకులు కాలేరు రామోజీ, బొక్క రవీందర్ రెడ్డి, బొక్క కృష్ణారెడ్డి, వేముల మహేశ్వర్ గౌడ్ ఉన్నారు.