calender_icon.png 9 July, 2025 | 10:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కోసం రైతుల పడిగాపులు

09-07-2025 06:21:19 PM

తాడ్వాయి (విజయక్రాంతి): యూరియా ఎరువు కోసం కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండల కేంద్రంలో బుధవారం రైతులు క్యూ లైన్ లో నిలబడి పడిగాపులు కాశారు. యూరియా ఎరువు వచ్చిందని తెలుసుకున్న రైతులు మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయానికి చేరుకొని వరుసలో నిలుచున్నారు. ఎక్కువ మంది రైతులు సింగిల్ విండో కార్యాలయానికి చేరుకోవడంతో ఎలాంటి గొడవలు కాకుండా ఉండటం కోసం పోలీసులు అక్కడికి చేరుకొని బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు సరిపోయే యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. తాము ఎన్నిసార్లు విన్నవించిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.