19-08-2025 12:44:08 AM
బూర్గంపాడు, ఆగస్టు 18,(విజయక్రాంతి): వరుస వర్షాలతో సాగు పనుల్లో ని మగ్నం కావాల్సిన రైతులు యూరియా కో సం పరుగులు పెడుతున్నారు. తెల్లవారక ముందే పీఏసీసీఎస్ గోదాముల వద్ద బా రులు దీరుతున్నారు. చివరకు యూరియా దొరుకుతుందో లేదోనని దిగులు చెందుతున్నారు. గతంలో ఏనాడూ ఎరువుల కోసం ఇంతటి ఇబ్బందులు పడలేదని, మున్ముం దు ఎరువులు అవసరమైతే పరిస్థితి ఏమిట ని రైతులు ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నారు.
గోదాముల వద్ద ఒక్కరికి ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారని సమాచారంతో మం డలంలోని గ్రామస్తులు కుటుంబ సభ్యులతో సహా మొరంపల్లి బంజరలోని సొసైటీ గో దాంకు సోమవారం భారీగా యూరియా కో సం పడి గాపులు కాశారు. ప్రస్తుతం వరి,పత్తి పంటలు సాగు చేసే రైతులకు యూరియా అవసరం ఉన్నది. పట్టాదారు పుస్తకం, ఆధా ర్ కార్డులతో అక్కడికి చేరుకున్న రైతులు క్యూలో నిల్చునే ఓపిక లేక పోవడంతో జి రాక్స్ ప్రతులను అధికారుల ముందు వరుసగా పెట్టి చెట్ల కింద, రోడ్ల వెంట రోజంతా కూర్చున్నారు.అయితే ఒక లోడు యూరి యా బస్తాలు రావడంతో అందుతాయో లే దోనని ఆందోళనకు గురవుతున్నారు.
పాల్వంచ లోను..
ఒకవైపు జోరు వాన.. మరోవైపు యూ రియా దొరకదనే ఆందోళన రైతులను వెం టాడుతోంది. యూరియా కొరతతో రైతులు తెలతెల వారకముందే సహకార సంఘాల వద్ద బారులు తీరుతున్నారు. పాల్వంచ సహకార సంఘం ముందు ఉదయం ఆరు గం టలకే మహిళలు, రైతులు ఆధార్ కార్డులు పట్టుకొని యూరియా కోసం బారులు తీరారు. కార్యాలయం 10:30 గంటలకు తెరుస్తారని తెలిసినప్పటికీ, యూరియా దొ రుకుతుందో లేదో అని పక్క మీంచలేసి పరిగెత్తుకొని సొసైటీ కార్యాలయానికి పరుగులు తీస్తున్నారు. రైతుకు ఒకటి రెండు బస్తాల కంటే ఎక్కువ ఇవ్వడం లేదని, ప్రస్తుతం పత్తి వరి పై పాటు సాగుతున్న నేపథ్యంలో యూ రియా అవసరం అధికంగా ఉండటంతో రైతులు ఇబ్బందులను పడుతున్నారు.