calender_icon.png 18 October, 2025 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు పెన్షన్ పథకం ఇవ్వాలి

17-10-2025 12:00:00 AM

వ్యవసాయం అనేది మన దేశానికి జీవనాధారం. భారతదేశంలో సుమారు 14.6 కోట్ల మంది రైతులు ఉన్నారు. వీరిలో 85 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే . వీరంతా అప్పులు చేసి అహర్నిశలు శ్రమించి కష్టపడి పంటలు పండించినా అందుకునే ఆ దాయం మాత్రం తక్కువగానే ఉంటుంది. ఈ మధ్య కాలంలో వాతావరణంలో విచిత్ర మార్పుల ప్రభావంతో  రైతులు పండిస్తున్న పంటలు అనిశ్చితిలో పడిపోతున్నాయి.

వర్షపాతం తగ్గిపోవడం, నేలలో తేమ తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పంటల దిగుబడి తగ్గుతోంది. రైతులు విత్తనాలు, ఎరువులు, పంట మందులు కొనుగోలు చేయడానికి అప్పులు తీసుకుంటున్నారు. పంటలు వి ఫలమైతే ఆ అప్పులు భారమైపోతున్నాయి. జాతీయ నేర రికార్డు బ్యూరో  గణాంకాల ప్రకారం 2014 నుంచి 2023 వరకు భారతదేశంలో సుమారు 1.2 లక్షల మంది రైతులు, వ్యవసాయ కా ర్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

వీరిలో అత్యధికంగా మహారా ష్ర్ట, కర్ణాటక, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెం దినవారే ఉన్నారు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కో సం ఒక స్థిరమైన పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరముం ది. నెలకు కనీసం 5 వేలు పెన్షన్ ఇచ్చే విధంగా సమగ్ర పథకం రూపొందించాలి.

ఆదిరెడ్డి, వరంగల్