calender_icon.png 30 October, 2025 | 6:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి

30-10-2025 12:39:30 AM

జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

సంగారెడ్డి, అక్టోబర్ 29 (విజయక్రాంతి) :ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో బుధవారం సంగారెడ్డి జిల్లాలో ఆయిల్ ఫాం పంట అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య పాల్గొన్నారు. ఆయిల్ ఫాం పంట ఆర్థికంగా లాభదాయకమని, నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో ఈ పంట విస్తరణకు రైతులు ముందుకు రావాలన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ, ప్రోత్సాహక పథకాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయన్నారు. ఉద్యాన శాఖ అధికారులు ప్రతి మండలంలో ఆయిల్ ఫాం సా గుకు అనుకూలమైన భూభాగాలను గుర్తించాలని, రైతులకు తగిన శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా ఉద్యాన శాఖ అధికారి, పట్టు పరిశ్రమ శాఖ అధికారి, సహకార సంఘాల ప్రతినిధులు, రైతులు, పి.ఎ.సి.ఎస్. సెక్రటరీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.