calender_icon.png 4 November, 2025 | 12:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళితుల భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోండి

03-11-2025 05:12:06 PM

నిర్మల్ రూరల్: సోన్ మండలం పాక్ పట్ల గ్రామంలోని దళితుల భూమిని కబ్జా చేసి మట్టి రోడ్డు వేసిన గ్రామ వీడిసి సభ్యులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఈరోజు ప్రజావాణిలో జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ ఆధ్వర్యంలో కలెక్టర్ కి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితులకు అండగా నిలవాల్సిన ఎస్సై వీడీసీ ప్రలోభాలకు లొంగి బాధితుల పైన వారి పక్షాన నిలిచిన అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులపైన బైండోవర్ కేసులు వేయడం వారిని బెదిరించడం అన్యాయమని ఇది పూర్తిగా దళితుల పక్షాన ప్రశ్నిస్తున్న నాయకుల నోరు నొక్కేయడానికి జరుగుతున్న కుట్ర అని అన్నారు. BSI జిల్లా అధ్యక్షుడు కొంతం మురళీధర్, జిల్లా ఉపాధ్యక్షులు కొంతం శ్రీనివాస్, మదస్తు భూమేష్, బక్కూరి రవీందర్, భూమేష్, బోర ముత్యం, బోర శ్రీనివాస్, రాజేశ్వర్, గంగన్న,సాయన్న, లక్మీ, భూమవ్వ తదితరులు ఉన్నారు.