calender_icon.png 4 November, 2025 | 7:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోయ కొనుగోళ్లలో ఇదేం తీరకాసు?

04-11-2025 12:37:36 AM

  1. టోకెన్లు పొందిన పంట అమ్మాలంటే రెండు నెలల కాలం
  2. చేతిలో పైసల్ లేక రైతులకు తీవ్ర ఇబ్బందులు
  3. వెంటనే చేపడితేనే రైతులకు ప్రయోజనం

కుబీర్, నవంబర్‌౩(విజయక్రాంతి): అమ్మ తిననివ్వదు. .. అడుక్కొనివ్వదు అనే మాదిరి గా జిల్లాలో సోయ రైతుల పరిస్థితి నెలకొంది. ఆరు కాలం చెమటూర్సి సోయా పంటలు పండిస్తే పంట అమ్ములు కావడానికి ప్రభు త్వం నిబంధనలు పేరుతో కాలయాపన చేయడం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించరుంది. దేవుడు వరమిచ్చిన పూజారి కరుణ లేదనే రీతిలో సోయ కొనుగోలులో జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు.

నిర్మల్ జిల్లాలో సుమారు లక్ష ఎకరాల వరకు సోయపంట సాగు చేయగా ప్రభుత్వం 10 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ప్రకటించింది. సోయ గంటలకు ప్రభుత్వం రూ. 5310 మద్దతులను ప్రకటించింది. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలను ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పటికే జిల్లాలో నిర్మల్ సారంగాపూర్ కుబీర్ బైంసా తదితర ప్రాంతాల్లో పంట కొనుగోలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి రైతులకు టోకెన్లు జారీ చేసింది.

టోకెన్ల జారీలోనూ..

నిర్మల్ జిల్లాలో సోయపంటలు పండించిన రైతులకు మద్దతుర పొందాలంటే ప్రభు త్వం కొనుగోలు కేంద్రాల్లోని సోయపట్టణం విక్రయించుకోవాలి. ఇప్పటికే చాలామంది రైతులు పంటను పండించి ఆ ధాన్యాన్ని నిల్వ ఉంచుకొని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రైవేట్‌లో దళారులు రూ.4300కి కొనుగోలు చేయడం వల్ల క్వింటాలకు రూ.1000 లు నష్టపోతమని భావించిన రైతులు ప్రభు త్వ కొనుగోళ్లపై ఆశలు పెంచుకున్నారు.

ఈ సంవత్సరం సోయపంటలు సాగు రైతులకు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోగా అధిక వర్షాలు ఆపై తెగుళ్లు వరదలు పంట దిగుబడులపై ప్రభావం చూపాయి. ఎకరానికి 8 గుంటల వరకు దిగుబడి వచ్చే సోయ పంట ప్రస్తుతం ఐదు కుంటలకు మించి రావడం లేదు. ఈ పంటలు దళారులకు విక్రయిస్తే ఎకరానికి రూ.5000 చొప్పున నష్టపోతామని భావిస్తున్న రైతులు కష్టమైనా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోని విక్రయించేందుకు టోకెన్లు పొందుతున్నారు.

ఇప్పటికే ముధోల్ ఖానాపూర్ కుబీర్ సారంగాపూర్ కుంటాల బైంసా నరసాపూర్ తదితర మండలాల్లో సోయా టోకెన్ల కోసం బార్లు తీరి రైతు లు పడిగాపులు పడుతున్నారు. ప్రభుత్వం పరిమిత సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో సోయపంటను ముందుగానే విక్రయించుకునే ఉద్దేశంతో రైతులు కూపన్ల జారీ కేంద్రాల వద్ద కూపన్లు పొందేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం జారీ చేస్తున్న కొనుగోలు కూపన్లు దక్కుతే పంట వికరించుకోవచ్చన్న రైతుల లకు ప్రభుత్వం తీరకాసు నిబంధన పెట్టింది.

ప్రస్తుతం టోకెన్లు తీసుకున్న రైతులు జనవరి మాసంలో పంట కొనుగోలను తూకం వేయనున్నట్లు టోకెన్‌పై తేదీ రాసి రైతులకు అప్ప గిస్తున్నారు. ఇప్పటికే సోయపంట ఆరబెట్టి రంగు మారిన ధాన్యం తెల్లగా మార్చేందుకు వాన నుంచి రక్షణ పొందేందుకు కంటికి రెప్పలా కాపాడుకున్న సోయా ధాన్యాన్ని టోకెన్ వస్తే అమ్ముకుందామనుకుంటే రెండు నుంచి మూడు నెల వరకు వేచి ఉండే విధం గా టోకెన్ సీరియల్ అధికారులు రైతులకు అందజేయడంతో రైతులు మండిపడుతున్నా రు.

అప్పటివరకు పంట ఎలా నిల్వ చేయాలి వర్షం వస్తే మళ్లీ తడిసిపోదా. రంగు మారి కొనుగోళ్లకు అడ్డువచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇది జరుగుతే మళ్లీ రైతులకు తీవ్ర నష్టం జరగనుంది. రైతులు వానాకాలంలో పండించిన సోయపంట చేతికి వచ్చి వికరించుకుంటే వచ్చిన ధాన్యంతో అమ్ముకునగా వాటి డబ్బులతోనే రబీ సీజన్‌కు పెట్టుబ డులు ఉపయోగపడతాయని భావించిన రైతులకు ఫిబ్రవరి వరకు జనవరి వరకు వేచి చూడవలసిన పరిస్థితి నెలకొనడంతో రైతులు మానసిక ఆందోళన చెందుతున్నారు.

జనవరి ఫిబ్రవరి మాసంలో పంట తూకం వేస్తే తమకు డబ్బులు ఎప్పుడు జమ అవుతాయో తెలియక రబీ సీజన్ కోసం పెట్టుబడును పెట్టే పరిస్థితి లేక రైతులు టోకెన్ పొందినప్పటికీ అవసరాల దృశ్య పంటను నిల్వ చేసే సామ ర్థ్యం లేక మళ్ళీ దళారులకు విక్రయించే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి జిల్లాలో స్వయకొనుగొలను వేగవంత చేయాలని తోకలు జారీ చేసిన వారికి వెంటనే పంట తూకం వేసి డబ్బులు చెల్లించే విధంగా చర్య లు తీసుకోవాలని జిల్లా రైతాంగం కోరుతుం ది ప్రభుత్వం ఆ దిశగా ఏ మేరకు చర్య తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.