27-08-2025 12:00:00 AM
కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్, ఆగస్టు 26 (విజయ క్రాంతి): ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని, వారంతా విద్యార్థులకు, సమాజానికి రోల్ మోడల్గా ఉండాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతారం మోడల్ స్కూల్ లో నిర్వహించిన జిల్లా స్థాయి టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్ (టిఎల్‌ఎం) ప్రదర్శనను పరిశీలించారు.
మేళాలో 18 మండలాల నుండి తెలుగు, ఇంగ్లీష్, గణితం, ఈవీఎస్ లో దాదాపు 180 ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. జిల్లా స్థాయిలో పాల్గొన్న ఎగ్జిబిట్లలో ఉత్తమమైన 8 టిఎల్‌ఎం లను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, ఏ ఎం ఓ ఆజాద్, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.