calender_icon.png 17 August, 2025 | 7:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎనిమిది రోజుల్లో ఫీజు బకాయిలు విడుదల

14-08-2025 01:44:18 AM

- రెండు విడతల్లో చెల్లింపులు

- డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క

- ఉప ముఖ్యమంత్రితో బీసీ సంఘాల నేతల చర్చలు సఫలం 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 13 (విజయక్రాంతి): రాబోయే ఎనిమిది రోజుల్లో గా రెండు విడతల్లో ఫీజు బకాయిలను విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ర్టంలో 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సమస్య పై ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది.

జాతీ య బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య నేతృత్వంలోని బీసీ సంఘాల నాయకులు బుధవారం డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి  భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పా టు ఈ చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను ఆయన దృష్టికి బీసీ నేతలు తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఉపముఖ్యమం త్రి ఎనిమిది రోజుల్లోగా రెండు విడతల్లో ఫీజు బకాయిలను విడుదల చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.

విద్యార్థుల భవిష్యత్తు అంధకారం: ఆర్.కృష్ణయ్య

ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయ బడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు లు కట్టలేదని విద్యార్థుల సర్టిఫికెట్లను  కళాశాలలు  నిలిపివేస్తున్నాయని తెలిపారు. దీంతో ఉద్యోగాలు వచ్చినా, పీజీ కోర్సుల్లో సీట్లు లభించినా చేరలేకపోతున్నారని వివరించారు.

విదేశాల్లో చదువుకునే, ఉద్యోగా లు చేసే అవకాశాలను కోల్పోతున్నారన్నా రు. మరోవైపు, లెక్చరర్లకు జీతాలివ్వలేక, అద్దెలు కట్టలేక కళాశాల యాజమాన్యాలు నానా అవస్థలు పడుతున్నాయన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ట్రస్ట్ బ్యాంకు విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఈ నాటకాన్ని అంగీకరించేది లేదని ఆయన పునరుద్ఘాటించారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లించాలని కోరారు.అలాగే రాష్ర్టంలోని 39 ప్రైవేట్ యూనివర్సిటీలలో బీసీ/ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లను తక్షణమే అమ లు చేయాలని డిమాండ్ చేశారు.