calender_icon.png 13 August, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంపొందించాలి

13-08-2025 01:25:55 AM

  1. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్

ముషీరాబాద్ మహంకాళి దేవాలయ పాలకమండలి ప్రమాణస్వీకారం

ముషీరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి) : ప్రజల్లో ఆధ్యాత్మిక భావనను పెంపొందించేందుకు నూతన ఆలయ పాలక మండలి కృషి చేయాలని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. మంగళవారం ముషీరాబాద్ మహాంకాళి దేవాలయ నూతన పాలకమండలిచే మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఆండాలు ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ కమిటీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన బి. నరేష్ కుమార్‌తో పాటు నూతన ధర్మకర్తల మండ లి సభ్యులు ఆలయ ప్రాంగణంలో బాధ్యతలు స్వీకరించారు.

ఈ కార్యక్రమానికి ము ఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను ప్రణాళికా బద్దంగా అభివృద్ధి పర్చు తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నదని తెలిపారు.  ఈ సందర్భంగా చైర్మన్‌గా ఎన్నికైన బి. నరేశ్ కుమార్, ధర్మకర్తలుగా ఎన్నికైన అనసూయ, హరీష్, అశోక్ ముదిరాజ్, చంద్రమౌళిలను అథిదులు, వివిధ పార్టీల నేతలు ఘనంగా సన్మానించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండం శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గం ఉపాధ్యక్షుడు పట్నం నాగభూషణం గౌడ్, రాష్ట్ర నాయకులు వెంకటేష్, జెనిగె శ్రీనివాస్ యాదవ్, అంజిరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు రాజ్ప్ తదితరులు పాల్గొన్నారు.