calender_icon.png 13 August, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎకో టూరిజంపై దృష్టి సారించాలి

13-08-2025 01:25:44 AM

  1. అమ్రబాద్, కవ్వాల్‌కు టూరిస్టులు వచ్చేలా చూడాలి 
  2. అటవీ, రెవెన్యూ భూ వివాదాలకు సంయుక్త సర్వే 
  3. అధికారుల ప్రమోషన్లకు ప్రతిపాదనలు పంపాలి 
  4. అటవీశాఖపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం 

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): తెలంగాణలో ఏకో టూరిజం అభి వృద్దిపై దృష్టి సారించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సింగపూర్ వంటి దేశాల్లో 30 ఎకరాల్లోనే నైట్ సఫారీలు ఉన్నాయని, మన రాష్ట్రంలో భారీ విస్తీ ర్ణాల్లో అటవీ ప్రాంతాలు ఉన్నాయని, అం దులోనే నదులు, జల పాతాలు ఉన్నందున మనకు ఉన్న వనరులను సద్వినియోగం చే సే ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు.

అటవీ శాఖపై కమాండ్ కం ట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అమ్రబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులు న్నా తెలంగాణ వాసులు ఇతర రాష్ట్రాల్లోని బందీపూర్, తడోబా వంటి ప్రాంతాలకు పులుల సందర్శనకు వెళ్లుతున్నారని సీఎం అన్నారు. అమ్రబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులకు సందర్శకుల సంఖ్యను పెంచేలా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.

అటవీ, రెవెన్యూ శాఖల మధ్య భూ వివాదాల పరిష్కారానికి సంయుక్త సర్వే చేపట్టాలన్నా రు. ఈ విషయంలో కలెక్టర్లు  ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం సూచించారు. వరంగల్ కాకతీయ జూ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. అలాగే వరంగల్ జూను ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యం తో అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని సూచించారు. 

బాధితులకు తక్షణ పరిహారం

అటవీ జంతువుల దాడిలో మృతి చెంది న లేదా గాయపడిన వారికి, పశువులు, పెం పుడు జంతువులు కోల్పోయిన వారికి తక్షణమే పరిహారం అందేలా చర్యలు తీసుకో వాలని సీఎం ఆదేశించారు. ఇందుకు సీఎంఆర్‌ఎఫ్ నుంచి అవసరమైన మేరకు నిధులు వినియోగించుకోవాలని సీఎం సూచించారు. అటవీశాఖ పరిధిలో చేపడుతున్న రహదారులు, ఇతర అభివృద్ధి పనులకు అవసరమైన అనుమతులు విషయంలో అటవీ శాఖ, ఆయా పనులు చేపడుతున్న శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు.

కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి అనుమతులను సాధ్యమై నంత త్వరగా సాధించాలన్నారు. అడవుల్లో వన్య ప్రాణుల సంరక్షణ, వాటి కదలికలను గమనించేందుకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలన్నింటిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రానికి తగిన సంఖ్యలో ఐఎఫ్‌ఎస్ అధికారుల కేటాయింపుపై కేంద్రంతో చర్చించాలని సీఎస్‌కు సీఎం సూచించారు.

అటవీ శాఖలో ప్రమోషన్లు, ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలను తక్షణమే సిద్దం చయాలన్నారు. శాఖలో ఉత్తమ పనితీరు కనబర్చుతున్న వారికి అవార్డులు ఇచ్చే ప్రక్రియను పునరుద్ధరించాలని సీఎం సూ చించారు. సమీక్షలోఅటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీమ్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాస్, పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ, పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్) ఎలుసింగ్ మేరు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.