calender_icon.png 10 November, 2025 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రిస్బేన్‌కు భారత్

12-12-2024 12:00:00 AM

బ్రిస్బేన్: బోర్డర్ సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టు మ్యాచ్ ఆడేందుకు టీమిండియా బుధవారం బ్రిస్బేన్‌లో అడుగుపె ట్టింది. బ్రిస్బేన్ ఎయిర్‌పోర్టు నుంచి భారత ఆటగాళ్లు హోటల్ రూంకు చేరుకున్నారు. గురువారం నుంచి ప్రాక్టీస్‌లో బిజీ కానున్నారు.

శనివారం నుంచి మూడో టెస్టు మొదలుకానుంది. ఇక మూడో టెస్టుకు పేస్, బౌన్స్‌తో కూడిన పిచ్‌ను తయారు చేసినట్లు గబ్బా మైదానం క్యురేటర్ డేవిడ్ సందుర్సి తెలిపాడు. గత పర్యటనలో గబ్బా పిచ్‌పై భారత్ చారిత్రక విజయం సాధించిన సంగ తి తెలిసిందే. పంత్ వీరోచిత ఇన్నింగ్స్ భారత్‌కు విజయాన్ని అందించడంతో పాటు సిరీస్‌ను అందుకునేలా చేసింది.