09-07-2025 06:42:19 PM
నిర్మల్ (విజయక్రాంతి): దేశంలో అసంఘటిత కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను బలహీనం చేసి నాలుగు లేబర్ కోడ్ చట్టాలను తీసుకురావడం జరిగిందని సిఐటియు జిల్లా కార్యదర్శి సురేష్ కుమార్(CITU District Secretary Suresh Kumar) అన్నారు. బుధవారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆశ వర్కర్లు అంగన్వాడీలు మున్సిపల్ కార్మికులు గ్రామపంచాయతీ వర్కర్లు 108 ఉద్యోగులు మున్సిపల్ ఉద్యోగులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఆర్డిఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్మికులకు హాని కలిగించే లేబర్ కోడ్ చట్టాలను ప్రభుత్వం రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమణ సుజాత గంగామణి ఇంద్రమాల రామా పద్మ రాజశేఖర్ లింగన్న తదితరులు పాల్గొన్నారు.