calender_icon.png 27 September, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవాదాయ శాఖలో డోలు, సన్నాయి పోస్టులను భర్తీ చేయండి

27-09-2025 12:18:35 AM

-సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దొడ్ల అనిల్ కుమార్

పెబ్బేరు రూరల్, సెప్టెంబర్ 26 : రాష్ట్రంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని ఆలయాలలో ఖాళీగా ఉన్న డోలు సన్నాయి వాయించే నాయి బ్రాహ్మణుల పోస్టులను భర్తీ చేయాలని వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడు దొడ్ల అనిల్ కుమార్ శుక్రవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను వారి నివాసంలో కలిసి వినతి పత్రం ఇచ్చారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలు దేవాలయాల్లో పనిచేసే వారు కొందరు రిటైర్డు అయి ఉంటే మరికొందరు స్వర్గస్తులు అయినారని వారుమంత్రి కి వివరించారు.2008 వ సంవత్సరంలో ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 460 పోస్టులను భర్తీ చేశారని,ఆ తరువాత 2019 వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మిగిలిన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారని తెలిపారు. కార్యక్రమంలో కోశాధికారి పంతులు చంద్రమౌళి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బాలరాజు, సభ్యులు ధూపాటి తారక రామారావు తదితరులు పాల్గొన్నారు.